బిచ్చగాడు సీక్వెల్ ఫస్ట్ లుక్..?

49
bichagaru sequel?
bichagaru sequel?

bichagaru sequel?

ఒకే ఒక్క సినిమాతో తెలుగువారికి అతను ఫేవరెట్ యాక్టర్ అయ్యాడు. కానీ అంతకు ముందే మోస్ట్ అండర్ రేటెడ్ అనదగ్గ రెండు బెస్ట్ మూవీస్ తో ఆకట్టుకున్నాడు. బట్ మూడో సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాతే ఆ సినిమాలను గుర్తించారు మనవాళ్లు. తెలుగువారికి పెద్దగా తెలియదు కానీ అతను మల్టీ టాలెంటెడ్. 2009లో మ్యూజిక్ కేటగిరీలో కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డ్ అందుకున్న ఫస్ట్ ఇండియన్. కంపోజర్, యాక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, సింగర్, లిరిసిస్ట్.. ఇలా పలు విభాగాల్లో అద్భుత ప్రతిభ చూపిస్తోన్న అతను విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగులో పాగా వేసిన మల్టీటాలెంటెడ్ విజయ్ ఆంటోనీ బర్త్ డే ఇవాళ. విజయ్ ఆంటోనీ చాలా సాధారణంగా కనిపిస్తాడు. తన సనిమాల్లో నటించడం కంటే పాత్రల్లా ప్రవర్తిస్తాడు. అందుకే చాలా త్వరగా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాడు. విజయ్ పుట్టింది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో.చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి పోషణలో బాగా చదువుకుని రికార్డ్ ఇంజినీర్ గా ఉద్యోగం మొదలుపెట్టి.. అటుపై సినిమా సంగీతం వైపు వచ్చాడు. 2005లో సినిమా సంగీత దర్శకుడుగా కెరీర్ మొదలుపెట్టాడు.

అప్పటికే తమిళ్ లో కొత్తతరం కుర్రాళ్లున్నా తనదైన బాణీలతో ఆకట్టుకున్నాడు విజయ్. 2008లో వచ్చిన ఓ తమిళ్ సినిమా అతని కెరీర్ నే మార్చివేసింది. సినిమా పేరు కాదళిల్ విళుంతేన్.. అంటే నేను ప్రేమలో పడ్డాను అని అర్థం. ఈ సినిమాలోని నాక్కముక్కా నాక్కముక్కా అనే పాట ఓ సంచలనమైంది. ఈ పాట కంపోజ్ చేసినందుకే అతనికి కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ విజయ్ ఆంటోనీ కావడం విశేషం. ఈ సినిమా విజయంలో సంగీతానిదే మేజర్ రోల్ అయింది. ఆశ్చర్యం ఏంటంటే.. ఆ తర్వాతి యేడాదే తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్ లో శ్రీకాంత్ వందో సినిమాగా వచ్చిన మహాత్మతో తెలుగులో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు. మహాత్మలోని ఫోక్ సాంగ్ తప్ప మిగతా అన్ని పాటలూ అద్భుతమైన పేరు తెచ్చాయి. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన దరువు సినిమాకు కూడా అతనే సంగీతం అందించాడు. మొత్తంగా 2012లో నాన్ అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. వైవిధ్యమైన కథతో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమా తెలుగులో నకిలీగా విడుదలైంది.

విమర్శలను మెప్పించినా.. అతను తెలుగువారికి పెద్దగా పరిచయం లేకపోవడంతో సినిమా గురించి ఎక్కువ మందికి తెలియలేదు. నకిలీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిందే సలీమ్. అప్పటికే నకిలీ గురించి తెలిసిన వాళ్లంతా సలీమ్ ను చూశారు. ఈ సినిమా మెడికల్ మాఫియా చుట్టూ తిరుగుతూ అద్భుతమైన థ్రిల్లర్ సినిమాగా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా కొందరు డబ్బున్న కుర్రాళ్లను హోటెల్ గదిలో బంధించిన తర్వాత సాగే సినిమా సూపర్బ్ అనిపిస్తుంది. ఎండింగ్ ను బట్టి దీనికీ సీక్వెల్ చేసే అవకాశం ఉంది. విజయ్ ఆంటోనీని హీరోగా తిరుగులేని క్రేజ్ తెచ్చిన సినిమా పిచ్చైక్కారణ్. తెలుగులో బిచ్చగాడుగా వచ్చిన ఈసినిమా తమిళ్ కంటే పెద్ద విజయం సాధించింది. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో వచ్చిన ఈ మూవీ చాలా యేళ్ల తర్వాత తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించింది.

మన సినిమాలే ఇబ్బంది పడుతోన్న టైమ్ లో ఏకంగా వంద రోజులు ఆడి సంచలనం సృష్టించింది. బిచ్చగాడు తర్వాత వరసగా వచ్చిన సైతాన్, యమన్, ఇంద్రసేన, కాశీ, రోషగాడు వంటి సినిమాలన్నీ విపరీతంగా నిరుత్సాహ పరిచాయి. ఇక లేటెస్ట్ గా తన బర్త్ డే సందర్భంగా బిచ్చగాడుకు సీక్వెల్ ను ప్రకటించాడు విజయ్ ఆంటోనీ. ప్రియా కృష్ణస్వామి అనే మహిళా దర్శకురాలు డైరెక్ట్ చేయబోతోన్న బిచ్చగాడు -2 ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశాడు విజయ్ ఆంటోనీ. మరి ఈ సినిమాతో ఫస్ట్ మూవీ రేంజ్ హిట్ అందుకోవాలని కోరుకుంటూ విజయ్ కి బర్త్ డే విషెస్ చెబుదాం..

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here