ఢిల్లీలో నువ్వా నేనా  అంటున్న ఆప్, బీజేపీలు

171
Big Fight Between AAP and BJP
Big Fight Between AAP and BJP

Big Fight Between AAP and BJP

ఢిల్లీ లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఢిల్లీ  ఫైట్ ఫైనల్ దశకు  చేరింది. ప్రచారానికి  ఇంకా కొద్ది  రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారం కోసం ఎదురుచూస్తున్న కమలదళం, ఈసారి ఎలాగైనా ఈ సారి అధికారం  చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోరాటం తారాస్థాయికి చేరింది. రెండు పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పౌరసత్వ సవరణ చట్టం, షహీన్‌బాగ్-జామియా మిలియా ఆందోళనల చుట్టూనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీనియర్ నేతలు ప్రచారం చేస్తుండగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. ఢిల్లీలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల ధ్యేయమని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. సీఏఏ వ్యతిరేక నిరసనలపై మోదీ ఘాటుగా స్పందించారు. నిరసనల పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. హింసాత్మక ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కాబోవని తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లు, బహిరంగ సమావేశాలతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మోదీ సర్కారు అభివృద్ధి సంక్షేమ పథకాల ను వివరిస్తూనే ఆప్, కాంగ్రెస్‌లపై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు.

బీజేపీకి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేస్తోంది. సీఎం కేజ్రీవాల్ రోడ్‌ షోలతో ఆదరగోడుతున్నారు. ఇక పీకే సలహాలతో కేజ్రీవాల్ రెచ్చ్చిపోతున్నారు. . విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మహిళలు, పేదలకు ఉచిత పథకాలను గురించి బాగా ప్రచారం చేస్తున్నారు.. కేంద్రం సహకారం లేకపోవడం వల్లే ఢిల్లీ అభివృద్ధి వేగంగా జరగడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా తన తంటాలు తాను పడుతుంది. కానీ కాంగ్రెస్ కి పెద్దగా చాన్స్ లేదని తెలుస్తుంది.

Big Fight Between AAP and BJP,delhi, election campaign, aap ,aam admi party

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here