Wednesday, May 14, 2025

కాంగ్రెస్ – బీజేపీ మ‌ధ్య బిగ్ ఫైట్..!

  • రెండు పార్టీల మధ్య హోరాహోరి
  • చెరి సగం పంచుకోనున్న జాతీయ పార్టీలు
  • ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీకి 0…..1 స్థానానికే పరిమితం
  • అన్ని సర్వే సంస్థలది ఒకే రకమైన అభిప్రాయం

అందరూ ఊహించనట్లుగానే రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య బిగ్ ఫైట్ నడిచిందని అన్ని సంస్థలు వెల్లడించాయి. రెండు పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగిందని సర్వే సంస్థలు తెలిపాయి.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరిది పై చేయి సాధిస్తారన్న అంశంపై వివిధ మీడియా సంస్థలు తాము సేకరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శనివారం సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేసాయి. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగగా, ఇందులో ఒక స్థానికి మజ్లిస్ పార్టీకి వదిలిస్తే మిగిలిన 16 సీట్లను కాంగ్రెస్, బీజేపీలు పంచుకోబోతున్నాయని అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. అంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హవా చాలా స్పష్టంగా కనిపిస్తుండగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్‌ ఖేల్ ఖతం కానున్నట్లు పలు సర్వే సంస్థలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ చాలా నష్టపోతున్నట్లుగా పేర్కొన్నాయి.

ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కడం కూడా అనుమానమేనని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ మరోసారి దారణమైన ఓటమిని చూవిచూడనున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు మధ్య భిన్నత్వం ఎక్కువగా కనిపించిందని తెలిపాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడం వల్ల ఓటింగ్ ప్రయారిటీ అంశాలు మారిపోయాయని వ్యాఖ్యానించాయి. అందుకే ఫలితాల్లోనూ భిన్నత్వం కనిపిస్తోందని సర్వే సంస్థలు తెలిపాయి.

జాతీయ స్థాయి అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగినందున జాతీయ పార్టీల మధ్యే ఎక్కువగా పోటీ జరిగిందని వెల్లడించాయి. మొత్తం ఓట్లలో కాంగ్రెస్ పార్టీ 38.6 శాతం ఓట్లను సాధించబోతుండగా, బీజేపీ ఓట్ల శాతం అనూహ్యంగా పెరగనుందని వెల్లడించాయి. ఆ పార్టీకి 33 శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేశాయి. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీల మధ్య పూర్తి స్థాయిలో నలిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి కేవలం 20.3 శాతం ఓట్లు వస్తాయని తెలిపాయి. మజ్లిస్ పార్టీకి 2 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశాయి.వివిధ సర్వే సంస్థల ప్రకారం నాలుగు పార్టీలకు వచ్చే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఎబీపీ సీ -ఓట‌ర్

కాంగ్రెస్ 7-9

బీఆర్ఎస్ 0

బీజేపీ 7-9

ఎంఐఎం… 1

 

పీపుల్స్ ప‌ల్స్

కాంగ్రెస్ 7-9

బీఆర్ఎస్ 0-1

బీజేపీ 6-8

ఎంఐఎం… 1

 

 

ఆరా స‌ర్వే

కాంగ్రెస్ 7-8

బీఆర్ఎస్ 0

బీజేపీ 8-9

ఎఐఎం…1

 

ఇండియా టీవీ – సీఎన్ఎక్స్

కాంగ్రెస్ 6-8

బీఆర్ఎస్ 0-1

బీజేపీ 8-10

ఎంఐఎం…1

 

జ‌న్‌కీ బాత్

కాంగ్రెస్ 4-7

బీఆర్ఎస్ 0-1

బీజేపీ 9-12

ఎంఐఎం… 1

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com