రచ్చ రచ్చగా మారిన బిగ్ బాస్ 3

Spread the love

Bigboss Selection Process Is Wrong

బిగ్ బాస్ షో మొదలవకముందే.. రచ్చ రచ్చ గా మారుతోంది . ఈ రియాలిటీ షోపై.. మొన్నటికి మొన్న శ్వేతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా గాయత్రీ గుప్తా కూడా ఆరోపణలు చేసారు . ఇక ఈ షో పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. బిగ్ బాస్ షోకు సంబంధించిన ఎపిసోడ్లను.. సినిమాలాగే సెన్సార్ చేసి టెలికాస్ట్ చేయాలని నిర్మాత కేతిరెడ్డి పిటిషన్ వేశారు. ఈ రియాలిటీ షోలో.. అసభ్యకర కంటెంట్ ఎక్కువగా ఉంటుందని.. దీని ప్రభావం పిల్లలపై ఎక్కువగా పడే అవకాశం ఉందని పిటిషన్ లో తెలిపారు.

“ఈ నెల 21 నుంచి స్టార్ మాటీవీ ప్రసారంచేయబోయే బిగ్ బాస్‌-3 షో మహిళలు,పిల్లలు చూసే స్థాయిలో హుందాగా లేదు.వంద రోజులపాటు వివిధ కుటుంబాలకుచెం దిన నటులు, ఇతర రంగాల్లో పేరున్నవారంతా ఒక్క చోట ఉంటారు. సౌమ్యం గాఉన్నవాళ్లను కూడా రెచ్చగొడతారు. నోటికివచ్చినట్లు గా మాట్లాడించి హైప్‌ క్రియేట్‌ చేస్తారు. రొమాన్స్, అసభ్యత ఉంటుంది.ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా ఒక్కసారిగా షోలో గందరగోళం సృష్టిస్తారు. సెన్సార్‌ లేకుండానే ప్రసారం చేస్తారు. పిల్లలు, మహిళలు, యూత్‌ను పక్కదారి పట్టించేలా మొత్తం కార్యక్రమం ఉంటుంది” అని పిల్ లో కేతిరెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో లో కొందరు పార్టిసిపెంట్లు మధ్యలోనే క్విట్ అవుతూ, ఎలిమినేట్ అవుతూ మీడియా ముందుకు వచ్చారు. కొందరు షో గురించి విమర్శిస్తే.. మరికొందరు మంచి అనుభూతి అంటూ కొన్ని చర్చా వేదికల్లో చెప్పిన సందర్భాలున్నాయి. అయితే తెలుగులో మాత్రం షో మొదలవ్వక ముందే, సెలక్షన్ ప్రోసెస్ లోనే తప్పిదాలున్నాయంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు మహిళలను అగౌరవ పరిచేలా, షో నిర్వాహకులు క్యాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నారంటూ కొందరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నేషనల్ వైడ్ గా వ్యాపించాయి. క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలోనే కాక ఇలాంటి రియాల్టి షో లో కూడా మహిళలను ఇబ్బంది పెడుతోందనే వార్త బయటికొచ్చింది.

దీంతో తెలుగు బిగ్ బాస్ షో పై పలు జాతీయ మీడియా ఛానెళ్లలో డిబేట్ లు నడుస్తున్నాయి. తెలుగు మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా నిర్వాహకులు ప్రవర్తించారని, అసలు అలా ప్రవర్తించే వీలుందా అన్న విషయాలపై చర్చలు జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ నిర్వాహకులు క్యాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నారని.. లేడీ కంటెస్టెంట్లను కమిట్మెంట్ అడుగుతున్నారని రెండు రోజుల క్రితం నటి గాయత్రి గుప్తా, యాంకర్ శ్వేతారెడ్డి ఆరోపించారు. షోలో.. పార్టిసిపెట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాక అగ్రిమెంట్ చేయకుండా మోసం చేశారని ఆరోపిస్తున్నారు. తమతో అసభ్యకరంగా మాట్లాడి కించపరిచినట్లు చెప్పారు. దీనికి సంబంధించి.. హైకోర్టులో ఇవాళ రిట్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.అయితే షో స్టార్ట్ అవ్వకముందే రావాల్సిన దాని కంటే ఎక్కువ పాపులార్టి ( కాంట్రవర్సిలతో ) వచ్చిందని, ఎటువంటి పబ్లిసిటీ లేకుండానే వార్తల్లోకి ఎక్కిందని కొందరు అంటున్నారు. ఇంత జరుగుతున్నా షో నిర్వాహకులు మాత్రం ఈ విషయంపై నోరు మెదపట్లేదు. స్టార్‌ గ్రూప్‌ వంటి పెద్ద సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ షోలో ఇలాంటివి చోటు చేసుకునే అవకాశమే లేదంటూ మరికొందరు చెబుతున్నారు. అయితే తమపై వివిధ పోలీస్ స్టేషన్లలో.. నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ షో కోఆర్డినేటర్స్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.అసలు లేడి కంటెస్టింట్లు చేసిన ఆరోపణల్లో నిజముందా.? నిజంగా రియాల్టీ షోలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందా? షో నడుస్తుందా? లేదా? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మాత్రం కోర్టు తీర్పు వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.

tags : Big boss 3, casting couch , gayathri guptha, swetha reddy , jagadishwar reddy , court case, quash petition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *