ఏపీ నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం

BiswaBushan Harichandan is AP President

విభాజిత ఆంద్రప్రదేశ్ నూతన గవర్నర్ గా భిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.నవ్యాంధ్ర చరిత్రలో నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నూతన గవర్నర్ చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తోపాటు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మంత్రులు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయవాడలోని పాత సీఎం క్యాంప్ ఆఫీసును రాజ్ భవన్ గా ఏపీ ప్రభుత్వం తీర్చిదిద్ది సకల సౌకర్యాలు కల్పించింది. గవర్నర్ ఇక్కడి నుంచే పాలించనున్నారు.

ఇక ఈనెల 16న భిశ్వభూషన్ ను ఏపీకి కొత్త గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుండి. ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను తెలంగాణకే పరిమితం చేసింది. భిశ్వబూషన్ హరిచందన్ 1971లో జన్ సంఘ్ లో చేరారు. ఆ తర్వాత 1988 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. బీజేపీ ఒడిషా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఆ ఎత్తులో భాగంగానే అపర బీజేపీ వాదిని ఏపీకి గవర్నర్ గా నియమించినట్టు బయట చర్చ జరుగుతుంది . ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పుడు ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో గవర్నర్ అసలు ఏమైనా సహాయపడతారా అన్నది ముందు ముందు తేలనుంది.

NOTICES FOR BIGBOSS

tags:

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article