టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్.. PART 07

సింహయాజి: ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది.
రోహిత్ రెడ్డి: సరే స్వామీజీ. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకో గంట వెయిట్ చేద్దాం. మళ్లీ బయటికి వెళ్లడం, రావడం ఇష్యూ అవుతుంది.
రామచంద్రభారతి: కర్ణాటక ఆపరేషన్ సందర్భంగా కూడా ఎమ్మెల్యేలను నేరుగా వాహనాల్లో చెన్నై తీసుకెళ్లాం. అక్కడి నుంచి ఇండిగో ఫ్లయిట్ లో ముంబై తీసుకెళ్లాం. ముంబై వెళ్లాక ఇవ్వాల్సింది ఇచ్చాం. ఇప్పటిదాకా జరిగింది ఇదే.
సింహయాజి: కర్ణాటక ఆపరేషన్ చేసినప్పుడు పంచలు, రుమాళ్లు కట్టుకుని.. గడ్డపారలు పట్టుకుని.. ఎమ్మెల్యేలు కూలీల్లాగా ట్రాక్టర్లు ఎక్కి ఫామ్ హౌస్ కి వచ్చారు.
గువ్వల బాలరాజు: ఏది? కర్ణాటకలోనా?
సింహయాజి: అవును. అదంతా స్వామీజీనే ఆపరేట్ చేశారు.
రామచంద్రభారతి: మొదట మేం రామనగర వెళ్లాం. కావాలంటే మీకు తేదీలు కూడా చెప్తాను. రామనగర వెళ్లాం. అక్కడి నుంచి ఈగల్టన్ రిసార్టుకు వెళ్లాం. అది పూర్తిగా కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న రిసార్టు. అక్కడినుంచి ట్రాక్టర్ల ద్వారా ఎమ్మెల్యేలను ఎల్లంక తీసుకెళ్లాం. అక్కడినుంచి వోల్వో బస్సుల్లో తరలించాం.
సింహయాజి: కొందరు నిక్కర్లు వేసుకుని, కొందరు రుమాళ్లు చుట్టుకుని..
రామచంద్రభారతి: ఎమ్మెల్యేలు కూడా రుమాళ్లు చట్టుకుని.. వర్కర్లలాగా వచ్చారు.
సింహయాజి: జస్ట్ వర్కర్లలాగా పారలు, గడ్డపారలు పట్టుకొని వచ్చేశారు. అక్కడి నుంచి బస్సులో వెళ్లిపోయారు.
గువ్వల బాలరాజు: ఢిల్లీలో అలాంటిదేమీ లేదు కదా?
సింహయాజి: ఢిల్లీలో అలాంటిదేమీ లేదు.
రామచంద్రభారతి: ఒకసారి మీరు మా గమ్యస్థానానికి చేరుకున్నారంటే మొత్తం మేమే చూసుకుంటాం.
సింహయాజి: ఢిల్లీ మొత్తం సెంట్రల్ కంట్రోల్ లోనే ఉంటుంది.
రామచంద్రభారతి: ఇక్కడ సమస్య ఏంటంటే.. ఫస్ట్ పార్ట్ అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి.
గువ్వల బాలరాజు: మేం అడిగేది ఇక్కడి గురించి కాదు. ఢిల్లీ గురించి.
రామచంద్రభారతి: వాళ్లకు అక్కడ డబ్బులు అవసరం లేదు. వాళ్లకు పవర్ కావాలి. పార్టీ మారి పదవులు తీసుకుంటారు. వాళ్లు ఒక్క రూపాయి కూడా తీసుకోరు.
సింహయాజి: వాళ్లలో ముఖ్యమైన వ్యక్తి సీఎం అవుతాడు.
రామచంద్రభారతి: బీజేపీ అభ్యర్థే సీఎం అవుతాడు. అందులోని వారు డిప్యూటీ సీఎం అవుతాడు. మిగిలిన వాళ్లు మంత్రులు అవుతారు.
గువ్వల బాలరాజు: అంటే చర్చలన్నీ అయిపోయాయా?
రామచంద్రభారతి: చర్చలు అయిపోయాయి. మీటింగ్ కూడా అయిపోయింది. బీజేపీ ఎప్పుడూ చెప్పిన మాట మీదే ఉంటుంది. ఏది చెప్తే అదే చేస్తాం. ఒక్కసారి మేం కమిట్ అయితే వాళ్లకు చెప్పింది పూర్తి చేస్తాం.
గువ్వల బాలరాజు: బీజేపీకి మీలాంటి వాళ్లే బలంగా ఉన్నారు కదా?
రామచంద్రభారతి: నేను మాత్రమే కాదు. వస్తే మీరు కూడా అవుతారు. పార్టీ విషయాలన్నీ చాలా డిఫరెంట్. మానవత్వం, నమ్మకం అనేది ముఖ్యమైనవి. నమ్మకంగా ఉన్నవారిని బీజేపీ గౌరవిస్తుంది. విశ్వాసం మీదే బీజేపీ నడుస్తోంది. మేం అదే నమ్ముతాం.
గువ్వల బాలరాజు: కానీ ఇప్పుడు మీరు విశ్వాసం అనే మాటకు అర్థాన్ని మారుస్తున్నారు. విశ్వాసం అంటే ప్రభుత్వాల్ని కూల్చడమేనా?
రామచంద్రభారతి: మేం ప్రభుత్వాల్ని కూల్చడం లేదు. ఈ మీటింగ్ లో మీరు సంతోషంగా ఉన్నారు కదా?
గువ్వల బాలరాజు: అవును. మేం సంతోషంగానే ఉన్నాం. ఎందుకంటే మేం మళ్లీ ఎమ్మెల్యేలం కావాలి.
రోహిత్ రెడ్డి: ఈయన ఎందుకు బయటికి వస్తున్నారంటే.. మంత్రి పదవి ఆశించారు. అది రాలేదు కాబట్టి బయటికి వస్తున్నారు.
రామచంద్రభారతి: చూడండి. మేం ఎక్కడ ప్రభుత్వాన్ని కూల్చినా కూడా.. కర్ణాటకలో మేం 16 మందిని తీసుకున్నాం. అందులో 10 మందికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చాం. కానీ 13 మందికి పదవులు ఇచ్చాం. ఐదారు సార్లు గెలిచిన మా ఎమ్మెల్యేలను కాదని వారికి పదవులు ఇచ్చారు.
గువ్వల బాలరాజు: నేను కూడా అదే చెప్తున్నా. సీనియర్లకు మంత్రి పదవులు రావడం లేదు.
రామచంద్రభారతి: ఒకవేళ మనం అధికారంలోకి వస్తే.. మీకు మంత్రి పదవి వస్తుంది. బీజేపీ మిమ్మల్ని మంత్రిని చేస్తుంది. మంత్రి పదవి నా చేతుల్లో ఉంటే కచ్చితంగా చేస్తా.
రామచంద్రభారతి: నిజానికి షిండేకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చాం. కానీ చర్చించిన తర్వాత ఆయనను సీఎంగా చేశాం.
గువ్వల బాలరాజు: ఆయన పూర్తి కాలం సీఎంగా కొనసాగుతారా?
రామచంద్రభారతి: అవును. పూర్తి కాలం సీఎంగా ఉంటారు. ఆయనకు రాజకీయ అనుభవం లేకున్నా కూడా మేనేజ్ చేస్తున్నారు.
రామచంద్రభారతి: మీరు ఒకసారి పదవుల్లో కూర్చుంటే.. మేం బయటి వాళ్లం అయిపోతాం. తర్వాత మిమ్మల్ని మేం ఇబ్బంది పెట్టం. మీ అపాయింట్ మెంట్ తీసుకునే కలుస్తాం. ఇచ్చిన హామీ మేరకు పదవిలో కూర్చోబెట్టే దాకా మాదే బాధ్యత. ఆ తర్వాత మీరే చూసుకోవాలి. తర్వాత మీకు ఏదైనా సమస్య వస్తే అప్పుడు మేం చూసుకుంటాం. కానీ మీ పనుల్లో మేం జోక్యం చేసుకోం.
గువ్వల బాలరాజు: ప్రభుత్వాల్ని కూల్చడం వెనక బీజేపీ ఎజెండా ఏంటి? మిగిలిన వాళ్లని సీఎంగా చేయడం.. వాళ్ల మీద ఎలాంటి కంట్రోల్ లేకపోవడం వెనక మతలబు ఏంటి?
రామచంద్రభారతి: చూడండి. నేను చెప్పేది నా గురించి. బీజేపీ గురించి కాదు. పదవి ఇచ్చిన తర్వాత బీజేపీ వారిని కంట్రోల్ చేస్తుంది. కానీ నేను మాత్రం వాటిలో ఇన్ వాల్వ్ అవను. ప్రతీ దాంట్లో నేను జోక్యం చేసుకుంటే బీజేపీ నాయకులకు పనేం ఉంటుంది? ప్రతీదాన్ని నాయకులే చూసుకోవాలి కదా?

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article