టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్.. PART 04

గువ్వల బాలరాజు: అక్కడ (ఏపీ) ఎలా ఉంది స్వామీ? ఇదే ఆపరేషన్ మొదలుపెట్టారా?
సింహయాజి: ఇది అయిపోతే అక్కడ మొదలు పెడతాం. మొన్ననే రోహిత్ కు ఒకటి చెప్పా.
రోహిత్ రెడ్డి: నాకోటి చెప్పారు మొన్న.
హర్షవర్ధన్ రెడ్డి: అక్కడ ప్రభుత్వం చాలా రోజులు ఉండటం కష్టమేనా?
సింహయాజి: అక్కడ (ఏపీ) నెల రోజుల్లో పూర్తి చేస్తాం.
గువ్వల బాలరాజు: అక్కడ ఒక్క రోజులోనే ఎవరైనా దగ్గరై అయిపోతారు.
రోహిత్ రెడ్డి: క్యాష్ ఎక్కడుందో చెప్తారా? చెప్తే మనం వెళ్లి పిక్ చేసుకోవాలి.
హర్షవర్ధన్ రెడ్డి: నేను అమెరికాలో ఉన్నప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు.
గువ్వల బాలరాజు: స్వామి వాళ్లు టార్గెట్ పెడితే ఎవరైనా ఖతం అవ్వాల్సిందేనా?
సింహయాజి: అమ్మో! బీజేపీ పట్టుకుందంటే ఇక అంతే!
గువ్వల బాలరాజు: కానీ ఢిల్లీలో ఫెయిల్ అయినట్టు ఉన్నారు.
నందు: ఢిల్లీ కూడా స్టార్ట్ అయింది. 15 మంది రెడీగా ఉన్నారు. ఇంకొందరు కూడా వస్తారు.
సింహయాజి: అసలు వాడిని ఈడీ పెట్టి లోపల వేశారు కదా? సిసోడియాను.
నందు: సిసోడియాను ఈడీ పెట్టి ఇరికించారు కదా!
గువ్వల బాలరాజు: అది బీజేపీ చేసిందేనా?
సింహయాజి: బీజేపీతోనే అవన్నీ సాధ్యం.
నందు: ఢిల్లీలో 36 మందిని రెడీ చేశారు. రాజస్థాన్ లో 30 మందిని రెడీ చేశారు. చూడ్డానికి సింపుల్ గా ఉంటాడు గానీ.. పంచ కట్టుకుని అన్ని పనులు చేస్తుంటారు.
సింహయాజి: వింటే గోడీ, లేదంటే ఈడీ!
గువ్వల బాలరాజు: గోడీ అంటే?
సింహయాజి: గోడీ అంటే సఖ్యత. ఫ్రెండ్ షిప్. లేదంటే ఈడీనే. రెండే ఆప్షన్లు.
సింహయాజి: ఇప్పుడు 38 మంది ఈడీ లిస్టులో ఉన్నారు తెలంగాణలో. వింటే గోడీ, లేదంటే ఈడీనే.
నందు: స్వామీజీ దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. డీల్ చేసేదంతా బీఎల్ సంతోష్.
సింహయాజి: ఏం చేయాలనేది ఆయన చెప్తూ ఉంటారు.
నందు: వాళ్లు కేసీఆర్ ను అసలు టచ్ చేయరు. జస్ట్ పక్కనున్నోళ్లకి అత్తరు పూస్తారు. అరబిందో, మెఘా వంటి పలువురు ఉన్నారు.
సింహయాజి: రామేశ్వరరావును వదిలేశారు. ఎందుకంటే బీజేపీకి వంద ఇచ్చేశాడు. వంద ఇస్తేనే ముగ్గురూ వచ్చారు. లేకపోతే ఎందుకొస్తారు? ప్రధాని, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్.
గువ్వల బాలరాజు: అలాంటి వాటికి డబ్బులు ఇస్తే వస్తారా? ఆయన అంత పెద్ద స్వామీజీ కదా?
సింహయాజి: అంత పెద్ద ఈవెంట్ కదా? దానికి ఇవ్వాల్సిందే.
నందు: వంద కోట్లు అనేది చాలా తక్కువ.
సింహయాజి: నిజానికి రామేశ్వరరావుకు కేసు ఉండే. అది తప్పించుకోవడానికి డబ్బు ఇచ్చి, మళ్లీ ఫేవర్ గా ఉండటానికి వారిని ఆహ్వానించారు. రామేశ్వరరావు మీద కేసు పెట్టిందే.. ఆయనను దగ్గర చేసుకోవడానికి!
గువ్వల బాలరాజు: ఇక్కడైతే మొత్తానికి బండిది ఏం నడవదా?
సింహయాజి: బండిది ఏం నడుస్తుంది? బండికి గండే!
గువ్వల బాలరాజు: కిషన్ రెడ్డిది కూడా నడవదా?
నందు: నడవదు. కిషన్ రెడ్డిది వెంకయ్య నాయుడు ఛానల్.
సింహయాజి: ఇక్కడేంటంటే ఎవరికి వారు హై కమాండ్ కు టచ్ లో ఉంటున్నారు.
గువ్వల బాలరాజు: అంటే పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పార్టీని నడిపే వాళ్లు లేరా ఇక్కడ?
సింహయాజి: లేరు. ఇప్పుడు తయారు చేస్తారు. కొత్త రక్తం వస్తే కొత్త రక్తానికి అంటగట్టాలని చూస్తున్నారు. మంచి పరిపాలనాదక్షత ఉన్న వారి కోసం చూస్తున్నారు. రోహిత్ రెడ్డికి ఇద్దామనుకుంటున్నా.
రోహిత్ రెడ్డి: నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు.
సింహయాజి: సీనియర్లు ఉంటే సరిపోదు కదా? కెపాసిటీ ఉండాలి.
గువ్వల బాలరాజు: ఇప్పుడు ఊ అంటే మోడీతో మాట్లాడుతా అన్నట్టు ఉంటారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. నిన్న మొన్న వచ్చిన వాళ్లు కూడా!
సింహయాజి: వాళ్లను మాట్లాడమనండి.
నందు: ఆర్ఎస్ఎస్ దగ్గర ప్రతీ ఒక్కరి సమాచారం ఉంటుంది. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో అక్కడ చేస్తారు.
నందు: కిషన్ రెడ్డి ఏమేం చేసిండు? కిషన్ రెడ్డి కథేంటి? కిషన్ రెడ్డికి సీఎంతో ఉన్న సంబంధం ఏంటి అనేది అన్నీ తెలుసు. కాబట్టి ఎవరిని ఏం చేయాలో అలా సైలెంట్ చేస్తారు. వెంకయ్య నాయుడును డమ్మీ చేయలేదా? ఆయన బ్యాచ్ అంతా రిటైరయ్యారు.
గువ్వల బాలరాజు: మొత్తానికి కిషన్ రెడ్డిని గుప్పిట్లో పెట్టుకున్నారు.
సింహయాజి: వీళ్లు ఇక్కడ చాలా మాటలు చెప్తారు. బండి సంజయ్ కి అసలు అపాయింట్ మెంటే దొరకదు.
గువ్వల బాలరాజు: మరి కిషన్ రెడ్డికి?
నందు: కిషన్ రెడ్డికి కూడా అంతే.
గువ్వల బాలరాజు: కేంద్ర మంత్రి అయినా అంతేనా?
నందు: అంతే. బీఎల్ సంతోష్ ఎవరినీ కలవడు. ఆయన కేవలం మోడీ, అమిత్ షాను మాత్రమే కలుస్తాడు. ఆయన ఆపరేషన్స్ లో ఉన్నాడు కాబట్టి, ఎక్కువ మందిని కలవడు. చాలా రిజర్వుడ్ గా ఉంటారు.
సింహయాజి: ప్రధాని వచ్చి వెళ్తారంటే అర్థం చేసుకోండి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article