ఇంటర్ ఫలితాల రగడపై ఇప్పుడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన బీజేపీ

BJP Complaint to Governor Regarding Inter results issue

ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడై చాలా కాలమైంది? దాదాపు రెండు నెలలు దాటింది. మరెందుకు గుర్తుకు వచ్చిందో కానీ ఉన్నట్లుండి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు తాజాగా రాష్ట్రపతిని కలిశారు. తెలంగాణ విషయంలో తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. తెలంగాణ ఇష్యూల మీద నేతలు పోరాడాలంటూ అధినాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసిన సమయంలోనే ఇంటర్ ఇష్యూను తెర మీదకు తెచ్చేలా వ్యవహరించటం విశేషంగా చెప్పాలి.

రాష్ట్రం ఏదైనా కానీ.. బర్నింగ్ ఇష్యూల మీద రాష్ట్ర సర్కారు తీరు బాగోలేదంటే గవర్నర్ ను.. తర్వాతి కాలంలో రాష్ట్ర పతిని కలవటం సహజం . ఇందుకు భిన్నంగా ఇంటర్ ఫలితాలు వెల్లడై నెలలు గడిచిన తర్వాత.. ఇప్పుడు ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకొని రాష్ట్రపతికి కంప్లైంట్ చేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇంటర్ పరీక్షలకు 9 లక్షల మంది హాజరైతే 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారని.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో 27 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇంటర్ బోర్డు తప్పిదాలతో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినట్లుగా వారు ఆరోపించారు. ఇక ఈ తీరుపై రాష్ట్రపతి తగిన చర్య తీసుకోవాలని కోరారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఇంటర్ పరీక్షల ఎపిసోడ్ ముగిసి.. కొత్త విద్యా సంవత్సరం షురూ అయిన వేళలో రాష్ట్రపతిని కలిసి కంప్లైంట్ చేయటం దేని కోసం అన్న ప్రశ్న వినిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article