గోపన్ పల్లిలో బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యం

సైబరాబాద్: గోపన్ పల్లిలో బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యానికి దిగాడు. చెరువుల పరిరక్షణ పేరుతో నెల రోజులుగా బిజెపి నాయకులు చెరువులను సందరిస్తున్నారు. ఈ నేపధ్యంలో గోపన్ పల్లి దేవుళ్ళ చెరువు వద్దకు సందర్శనకు వారు వెళ్లారు. కమిటీ సభ్యులు యోగనంద్, మువ్వు సత్యనారాయణ, జ్ఞానేంద్ర ప్రసాద్, నరేష్, ప్రభాకర్, ఎకరా భూమి కబ్జా చేసి పార్టీ ఆఫీస్ గెస్ట్ హౌస్ గచ్చుబౌలి కార్పొరేటర్ గంగాధర్ నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకోవడానికి అక్కడికి బిజేపి నేతలు వెళ్లారు. కమిటీ సభ్యులను ఫోటోలు వీడియోలు తియొద్దు అంటూ ఫోటో గ్రాఫర్ పై కార్పొరేటర్ దాడి చేసాడు. ఎందుకు వచ్చరంటూ కమిటీ సభ్యుల పై గంగాధర్ అనుచరులు దాడికి దిగారు. బిజేపి నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. చందా నగర్ పీఎస్ లో కార్పొరేటర్ గంగాధర్ పై కమిటీ సభ్యుల పిర్యాదు చేసారు. ఆరుగురి పై గంగాధర్, గంగాధర్ అనుచరులు దాడి చేసినట్లు పిర్యాదు లో పేర్కోన్నారు. సొమ్మసిల్లి పడిపోయిన మువ్వ సత్యనారాయణ హాస్పత్రికి తరలించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article