కేసీఆర్ మున్సిపల్ బిల్లుపై బీజేపీ ఫైర్

BJP FIRE IN KCR MUNICIPAL BILL

మున్సిపల్ బిల్లు రాజ్యాంగ నిబంధనల వ్యతిరేకంగా ఉందని ఆదరా బాదరాగా చేశారని దత్తత్రేయ నేతృత్వంలో బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసారని గవర్నర్ బిల్లు వెనక్కి పంపినా సీఎం తీరులో ఎలాంటి మార్పు లేదని .బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం కేసీఆర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విస్తృత స్థాయి ప్రజా ప్రయోజనం ఉండి ,రెండు సభలు నిర్వహించలేని పరిస్థితి లో గాని ,ఎమర్జెన్సీ సమయంలో ఆర్డినెన్స్ తీసుకువస్తారు..ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ర్టంలో ఉందా అని ప్రశ్నించిన కృష్ణ సాగర్ రావు ఆర్డినెన్స్ ఎప్పుడు చేయాలో కేసీఆర్ కు తెలియనట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ ద్వారా చట్టం తేవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ గవర్నర్ ఆమోదానికి పంపిన బిల్లులో ప్రజా ప్రయోజనాలు లేవు ,టిఆర్ఎస్ లబ్ది మాత్రమే ఉందని వారు ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యత తగ్గిస్తూ ,అధికారుల ప్రాధాన్యత పెంచడం ఏంటీ అంటూ నిలదీశారు . ఈ ఆర్డినెన్స్ కు రాజ్యాంగ స్పూర్తి లేదన్న బీజేపీ నాయకులు ఈ ఆర్డినెన్స్ ను పాస్ చెయ్యొద్దని గవర్నర్ కు లేఖ రాస్తామని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ చేయాల్సింది గవర్నర్ అని ,సీఎం కాదని ,సీఎం సలహా మాత్రమే ఇవ్వాలని వారన్నారు.

క్యాబినెట్ భేటీ లేకుండా ఆర్డినెన్స్ ఎలా ఇస్తారు..ఈ అనైతిక చర్య కు గవర్నర్ బాధ్యుడు కావొద్దని గవర్నర్ ను కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. సీఎస్ ,మిగతా ఐఏఎస్ ,ఐపీఎస్ లు ఏం చేస్తున్నారు..రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు ఏలా తయారు చేస్తారు అంతో మండిపడ్డారు . ఈ బిల్లు ఐఏఎస్ లు రూపొందించిన బిల్లులా లేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ రాజకీయ నేతలు రాసినట్లు ఉందన్న కృష్ణ సాగర్ రావు సెక్రటరియేట్ లో ఉన్న ఉన్నతాధికారుల పై తీవ్ర అసంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈ బిల్లు చట్టం కావడం కల మాత్రమే అన్న ఆయన బిల్లు మార్చి రాయాల్సిందే అప్పుడే సభలో ఆమోదం పొందే అవకాశం ఉంది అని కృష్ణ సాగర్ రావు తెలిపారు.

NOTICES FOR BIGBOSS

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article