తెలంగాణలో బీజేపీలో చేరికలు

BJP is opponent for TRS in telangana

తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించిందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. తెలంగాణా బీజేపీ నాయకులు తెలంగాణలో ఆపరేషన్ కమల ప్రారంభించారు. అందుకోసం రాం మాధవ్ ను రంగంలోకి దింపారు . లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ముఖ్యనేతలను ఆకర్షించే పనిలో పడ్డారు.

తెలంగాణాపై దృష్టి సారించింది బీజేపీ . తెలంగాణలో నాలుగు పార్లమెంట్‌ స్థానాలు గెలిచిన ఉత్సాహంలో రకరకాల వ్యూహాలకు స్కెచ్ వేస్తోంది కమలం పార్టీ. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆకర్షిస్తూ, తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగాలని అనేక ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరారు. టీడీపీ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి, పీసీసీ మైనారిటీ నేత షేక్‌ రహమతుల్లా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు నాయకులకు కమలం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article