బీజేపీ జనసేనల లాంగ్ మార్చ్ వాయిదా

BJP -Janasena long march postponed

రాజధాని అమరావతి కోసం ఏపీలో ప్రతిపక్ష పార్టీలు పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలో  ఇటీవల పొత్తు పెట్టుకున్న బీజేపీ జనసేన పార్టీలు రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.  బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని  వాయిదా వేసుకున్నట్లు బీజేపీ నేత నాగభూషణం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇకపై అన్ని కార్యక్రమాలు జనసేన- బీజేపీ కలిసే చేస్తాయని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. రాజధాని విషయంలో రైతులకు అండగా ఉండటానికి.. బీజేపీ- జనసేన కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తామని, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మనోహర్ తెలిపారు.ఈ భేటీలో బీజేపీ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, తదితర ముఖ్యనేతలతో పాటు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు.

BJP -Janasena long march postponed,bjp, janasena , long march, capital amaravati, capital farmers , vijayawada , post pone , pawan kalyan , kanna lakshmi narayana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *