ఆపరేషన్ కమల్ ప్రారంభించిన బీజేపీ

హైదరాబాద్:మిషన్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నయా టార్గెట్‌. జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇలా ముగిశాయో లేదో.. అలా మిషన్‌ చేపట్టింది బీజేపీ. పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెట్టిన కమలనాథులు ఆపరేషన్‌ ఆకర్ష్‌ స్పీడ్‌ పెంచాలని నిర్ణయించారు. ఆపరేషన్ ఆకర్ష్‌ కోసం స్పీడప్ కోసం ప్రత్యేకంగా కమిటీ నియమించారు. 8 మందితో ఆపరేషన్‌ ఆకర్ష్‌ కమిటీ వేశారు. ఈ కమిటీని ఒకసారి చూస్తే.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కన్వీనర్‌. మెంబర్స్‌గా డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌, వివేక్‌ వెంకట స్వామి, గరికపాటి మోహన్‌రావు, చంద్రశేఖర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌.దుబ్బాక, GHMC, హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెలుపు తర్వాత బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ రియల్‌ సీన్‌ చూస్తే పెద్దగా చేరికలు లేవు. దీంతో కమిటీని మార్చారు. ఈటలకు కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగింతచారు. ఈయనకు బాధ్యతలు అప్పగింతకు కారణాలు చూస్తే పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెలుపు తర్వాత బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే ఒకరిద్దరు గల్లీ నేతలు తప్పా..పెద్ద నేతలు ఎవరూ కమలం కండువా కప్పుకోలేదు. ఇంద్రసేనారెడ్డి కమిటీ పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. కొందరు నేతలు బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేశారు. కానీ వారితో మాట్లాడే కమలం నేతలు లేకుండా పోయారు. దీంతో ఈసారి కమిటీలో ఇతర పార్టీల నేతలతో రిలేషన్‌ ఉన్నవారికి పెద్ద పీట వేశారు. ఈటల రాజేంద్, డీకే అరుణతోకు విస్తృత పరిచయాలు ఉండడంతో వారి పరిచయాలను పార్టీకి ఉపయోగించుకోవాలని ప్లాన్‌ వేశారు. ఆషాడం మాసం ముగియగానే ఆపరేషన్‌ ఆకర్ష్‌ వేగవంతం చేయాలని నిర్ణయించారు.ఇక నుంచి కమలం కండువాల మార్పిడి పెద్ద ఎత్తు జరుగుతుందని బీజేపీ నేతలు ఆశగా ఉన్నారు. ఆదిలాబాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ జిల్లాల నుంచి కీలక నేతలు త్వరలో కమలం కండువా కప్పుకుంటారని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెట్టారు. ఇకపై అసెంబ్లీ సెగ్మెంటు కేంద్రంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. గ్రౌండ్‌ లెవల్లో ప్రజల వద్దకు వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మంగళవారం జరిగే పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజాసమస్యలు, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై కమిటీ అధ్యయనం చేసిన అంశాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article