BJP leader GVL thrown the Slipper by comments man
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు చేదు అనుభవం ఎదురైంది… ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా… ఆయనపై ఓ వ్యక్తి షూ విసిరాడు. అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్‌కు గురయ్యారు. వెంటనే షూ విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు బీజేపీ కార్యాలయ సిబ్బంది. షూ విసిరిన వ్యక్తిని కాన్పూర్‌కు చెందిన శక్తి భార్గవగా గుర్తించారు. దాడి ఎందుకు చేశారన్నవివరాలు తెలియాల్సి ఉంది.