కెసిఆర్ యాగాలు చేసేది కొడుకు కోసమేనన్న బీజేపీ నేత లక్ష్మణ్

185
BJP Leader Hot Comments On CM KCR
BJP Leader Hot Comments On CM KCR

BJP Leader Hot Comments On CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. కెసిఆర్ యాగాలు చేస్తుంది కొడుకు కోసం అని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కేసీఆర్ కు పట్టడం లేదని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలో బాహుబలులు.. కట్టప్పలు ఉంటే.. బీజేపీలో మోదీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో దళితులను ముఖ్యమంత్రి చేసిన ఘనత బిజెపికే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ యాగాలు చేసేది.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసమేనని, ప్రజల మేలు కోసం కాదని అన్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని వారు చెబుతున్నా సీఎం కేసీఆర్ స్పందించడం లేదన్నారు. మోదీ చేస్తున్న అభివృద్ధికి  ఆకర్షితులై చాలామంది బిజెపిలో చేరుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. సూర్యాపేట వద్ద కృష్ణా నదిలో మూసీ నది కలిసే చోటును పరిశీలించేందుకు లక్ష్మణ్ పార్టీ నేతలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి తీవ్ర విమర్శలు చేశారు. మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పి తండ్రి కొడుకును బడాయి కబుర్లు చెప్పారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఏం చేసిన కుటుంబ సంక్షేమం తప్ప ప్రజాసంక్షేమం కోసం చేయరని ఆరోపించారు

tags: CM KCR, KTR, TRS, BJP, Lakshman, Musi River, Suryapet, Modi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here