ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం : బీజేపీ లక్ష్మణ్  

126
BJP Leader Laxman Fires On KCR And Owaisi
BJP Leader Laxman Fires On KCR And Owaisi

BJP Leader Laxman Fires On KCR And Owaisi

ఈ నెల‌లో ప్రతీ ప‌ల్లెకీ, ప్ర‌తీ ఇంటికీ  బీజేపీ  వెళ్తుంద‌ని సీఎం కేసీఆర్ , ఓవైసీ ల గురించి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉందని బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు  ల‌క్ష్మ‌ణ్‌ పేర్కొన్నారు .పార్ల‌మెంటులో చ‌ట్టం చేసిన త‌రువాత అసెంబ్లీలో చేసే తీర్మానం చెల్ల‌ద‌ని తెలిసి కూడా ప్ర‌జ‌ల‌ను ఎందుకు మ‌భ్య‌పెడుతున్నారు అని ప్ర‌శ్నించారు. ఈ అంశంపై ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కేసీఆర్, అస‌దుద్దీన్ ఒవైసీ ద్వంద్వ నీతిని వివ‌రిస్తామ‌న్నారు.   ఆ రెండు పార్టీలు, ఇద్ద‌రు నేత‌లూ క‌లిసి తెలంగాణ ఏర‌కంగా నాశ‌నం చేస్తున్నార‌నేది చెప్తామ‌న్నారు.

తెలంగాణ‌లో మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్నారు. ఆ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఒవైసీ అనీ, ఇద్ద‌రూ క‌లిసే ప్ర‌తీ అంశానికీ మతం రంగు పులిమే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుకు వ‌క్ర‌భాష్యం చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, అడ్డుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెబుతున్నార‌న్నారు. బాధ్య‌తాయుత‌మైన సీఎం కుర్చీలో ఉండి అస‌దుద్దీన్ కి కొమ్ము కాయ‌డం స‌రికాద‌న్నారు. సీఏఏ ముస్లింల‌కు వ్య‌తిరేక‌మ‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు చెప్పి, ప్ర‌జాక్షేత్రంలో ఇద్ద‌ర్నీ దోషులుగా నిల‌బెడ‌తామ‌న్నారు ల‌క్ష్మ‌ణ్‌.

BJP Leader Laxman Fires On KCR And Owaisi,bjp, CAA,#kcr,#trs,#njp,#laxman,#asaduddinowaisi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here