పాపకోసం .. బీజేపీ ధర్నా ఉద్రిక్తం

Spread the love

BJP Leaders are serious on Baby Rape issue

వరంగల్ లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై బీజేపీ చేపట్టిన ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది. ముగ్గురు బీజేపీ నేతలకు గాయాలు అయ్యాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. రోడ్డెక్కి ధర్నా చేపట్టారు బీజేపీ కార్యకర్తలు, నేతలు. నిందితుడి దిష్టిబొమ్మను తగలబెట్టాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే వరంగల్ సెంటర్ లో భారీ ఎత్తున గుమిగూడారు బీజేపీ అభిమానులు. ఈ క్రమంలోనే.. దిష్టిబొమ్మపై పెట్రోల్ పోశారు. ఆ వెంటనే నిప్పు పెట్టారు. అయితే ఇక్కడే అపశృతి జరిగింది. పెట్రోల్ కావటంతో మంటలు ఒక్కసారిగా పెద్దఎత్తున వచ్చాయి. ఆ పక్కనే ఉన్న వారికి అంటుకున్నాయి. బీజేపీ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మతోపాటు మరో కార్యకర్తకు మంటలు అంటుకున్నాయి.

ఈ ఘటన కొంత మంది పరుగులు తీశారు. మంటలు అంటుకున్న వారు కేకలు వేస్తూ పరుగు పెట్టారు. వెంటనే మిగతా వారు అలర్ట్ అయ్యారు. వారి శరీరానికి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తున్నారు. శరీరంలో కొంత భాగం కాలిపోయిందని.. ప్రాణాపాయం లేదని వెల్లడించారు వైద్యులు. పోలీసుల అత్యుత్సాహం వల్లే ప్రమాదం జరిగిందని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీస్ జులం నశించాలి అంటు నినాదాలు చేశారు. బీజేపీ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మను టీఆర్ఆర్ పార్టీ టార్గెట్ చేసిందనీ.. టీఆర్ఎస్ ప్రోద్భలంతోనే సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి ప్రమాదాన్ని సృష్టించాడని బీజేపీ ఆరోపిస్తోంది. సిట్యువేషన్ ఉద్రిక్తంగా మారటంతో.. పోలీసులు మోహరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *