ఉండవల్లికి బిజెపి కౌంటర్

విజయవాడ:మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కు బీజేపీ నేత ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ఇ చ్చారు. ట్వీట్టర్ వేదికగా అయన వ్యాఖ్యనించారు. ఉండవల్లి గారు , రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతూనే రాజకీయాల గురించి మాట్లాడతారు,నేతలను కలుస్తారు, ప్రశ్నిస్తే అబ్బెబ్బే అదేం లేదండి ఉత్తినే పిలిస్తే వెళ్ళానంటారు . ఊసరవెల్లి రాజకీయాలు మానేసి మీదృష్టిని బీజేపీ మీద నుండి మీకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ ను పైకి లేపడం మీద పెట్టండని అయన అన్నారు. సోమవారం నాడు ఉండవల్లి మాట్లాడుతూ కేసీఆర్ ను పొడుగుతూ బీజేపీని విమర్శించిన సంగతి తెలిసిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article