BJP looks for new leader in Telangana
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై పార్టీ జాతీయ నాయకత్వం సూచన మేరకు కోర్ కమిటీ భేటీ జరిగింది. పరిశీలకులు అనిల్ జైన్, జయంత్ జై పాండే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అభిప్రాయసేకరణ జరిపారు. ఆరు గంటల పాటు జరిగిన ఈ కోర్‌కమిటీ భేటీలో 41 మంది ముఖ్యనేతలు పాల్గొన్నారు. లక్ష్మణ్‌తోపాటు, మాజీ మంత్రి డీకే అరుణ, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సీనియర్ నాయకులు ఏపీ జితేందర్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, పేరాల శేఖర్‌రావు, కృష్ణసాగర్‌రావు.. తమకు రాష్ట్రపార్టీ చీఫ్‌గా అవకాశం ఇవ్వాలని పరిశీలకులను కోరారు. బీజేపీ రాష్ట్ర కమిటీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ సంస్కృతిని పరిచయం చేయాలని పలువురు సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక సీఏఏకు మద్దతుగా వచ్చేనెల 15న ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభ నిర్వహణపై చర్చించారు. సభను సక్సెస్ చెయ్యటం కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు.