ఎన్నికల లబ్ధి కోసమే డబుల్ బెడ్రూం ఇళ్లు

42
BJP Minister Kishan reddy visit double bedroom houses
BJP Minister Kishan reddy visit double bedroom houses

BJP Minister Kishan reddy visit double bedroom houses

ఎన్నికల్లో లబ్ధి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను ఆశగా చూపుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో  ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సోమవారం కిషన్ కె. లక్ష్మణ్‌తో కలిసి ముషిరాబాద్‌ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు లబ్ధిదారులతోనూ మాట్లాడారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ర్టం ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించినా.. కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తమదన్నారు. 2015లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు నేటికి పూర్తి కాలేదని గుర్తు చేశారు.  అన్ని రంగాల్లో టీఆర్ఎస్ విఫలమైందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని తెలిపారు. కేంద్ర నిధులతో ఆంద్రప్రదేశ్‌లో 7లక్షల ఇళ్లు పూర్తి చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో దాదాపు 20లక్షల మంది పేదలకు ఇళ్లు లేవన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలో వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here