బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు అసెంబ్లీకి వచ్చింది అందుకేనా

BJP MLA Manikayala Rao Got Assembly

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిన బిజెపి పార్టీ పై ఏపీలో రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. ఇక ఆ పార్టీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు సైతం ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో బిజెపి నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజమండ్రి అర్బన్ నుండి గెలిచిన ఆకుల సత్యనారాయణ పార్టీకి గుడ్బై చెప్పి జనసేన కు జై కొట్టారు. ఇక మిగిలిన ముగ్గురు లో ఇద్దరు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. తమ అనుకున్నచోట టికెట్ ఏ పార్టీ ఇస్తుంది ఆ పార్టీలో చేరాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తుంది. ఇక మిగిలిన ఒకే ఒక ఎమ్మెల్యే పైడి కొండల మాణిక్యాలరావు మాత్రం బీజేపీ ఉనికి చాటేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగా నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా చేశారు . ఇక బుధవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరైన ఆయన అనంతరం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తాను రాజీనామా పంపింది సీఎంకు మాత్రమే అని స్పీకర్‌కు ఇంకా పంపలేదని ఎమ్మెల్యే మాణిక్యాలరావు అన్నారు. రాజీనామాను ఆమోదించాల్సిన బాధ్యత సీఎంపై ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వచ్చానని అన్నారు. తాను చేసిన దీక్ష జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైందని మాణిక్యాలరావు తెలిపారు. మొత్తానికి బిజెపి ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే మాణిక్యాలరావు హల్చల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో సైతం మాణిక్యాలరావు దర్శనమిచ్చింది అందుకేనని భావిస్తున్నారు రాజకీయ వర్గాలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article