తహసీల్దార్లు తప్పులు చేయరని గ్యారెంటీ ఏంటి?

19
BJP mla Rajasingh comments on New revenue act
BJP mla Rajasingh comments on New revenue act

BJP mla Rajasingh comments on New revenue act

అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు.  వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి తహసీల్దార్లపై భారం వేయడం ఎంత వరకు సమంజసంమని, వీఆర్వోలే కాదు తహసీల్దార్లు కూడా అవినీతి మరక అంటుకుందని అన్నారు. కొంతమంది వీఆర్వోలు చేసిన తప్పులకు వీఆర్వోలందరిపై అవినీతి ముద్ర వేయడం సరికాదు. వీఆర్వోలు చేసిన తప్పులనే తహసీల్దార్లు చేయరని గ్యారెంటీ ఏంటి? తహసీల్దార్లు, అదనపు కలెక్టర్లు కూడా ఏసీబీకి పట్టుబడుతున్నారు కదా అని ఆయన ప్రశ్నించారు. అధికారులను కాదు, వ్యవస్థను మార్చాలి. రైతుల నుంచి డబ్బులు అడిగే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. దేవాదాయ, ల్యాండ్‌ సీలింగ్, అసైన్డ్‌ భూములను కూడా సర్వే చేస్తారా?’అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే  శ్రీధర్ బాబు మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టం అమలుకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని చట్టంలో పలు మార్పులను సూచించారు. సర్వే, సెటిల్మెంట్‌ తర్వాతే మ్యుటేషన్‌ చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here