ఆ బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

BJP MLA Shocking Comments If I Got chance ill blast them

యూపీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పదుడిగా పేరున్న విక్రమ్ సైనీ మరో సారి వివాదాస్పద వ్యాక్యాలు చేశారు. దేశంలో భద్రత కరువైందని అన్నవాళ్లు ఎవరు….వాళ్లంతా దేశ ద్రోహులే….అలాంటి వాళ్లంతా దేశం విడిచి వెళ్లిపోవాలి. లేదా నాకు హోమ్ శాఖ అప్పగించడండి. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వాళ్లందర్నీ బాంబులు పెట్టి లేపేస్తా….ఈ డైలాగ్ ఏదో సినిమాలోది అనుకుంటే పొరబడినట్లే. ఇది అక్షరాల ప్రజాజీవితంలో ఉన్న ప్రజాప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. బాంబులు పెట్టి లేపేస్తా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నాయి.
దేశంలో భద్రత కరువైందని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముజఫర్ నగర్ లో గురువారం ఢిల్లీ డెహ్రాడూన్ జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేయనున్న 151 అడుగుల ఎత్తైన జాతీయ జెండా కోసం భూమి పూజ చేశారు ఎమ్మెల్యే విక్రమ్ సైనీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో భద్రత కరువైందన్న వాళ్లంతా దేశ ద్రోహులేననీ అలా అన్న వాళ్లందర్నీ బాంబులతో లేపెయ్యాలని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రజలంతా భారతమాతను కీర్తిస్తూ, వందేమాతరం ఆలపిస్తుంటే కొందరు దేశ ద్రోహులు మాత్రం దేశంలో భద్రత లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వాళ్లంతా దేశం విడిచి ఎక్కడ క్షేమంగా ఉంటారో అక్కడికి వెళ్లిపోవాలి అని సూచించారు. లేదా తనకు హోం శాఖ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వాళ్లందర్నీ బాంబులు పెట్టి లేపేస్తా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం విక్రమ్ సైనీ కొత్తేమీ కాదు. ఇటీవల మధ్య ప్రదేశ్ సచివాలయంలో వందేమాతరం ఆలపించే సంప్రదాయాన్ని నిలిపివేయడం పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ వందేమాతరం గీతాన్ని విస్మరిస్తున్నారు అని ఆరోపించారు. భారత మాతకి సైతం జై కొట్టడం లేదని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో వందేమాతరం గేయాన్ని నిషేధించారు. వాళ్ల మనస్తత్వానికి ఇది అద్దంపడుతుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజలతో చీవాట్లు తిన్నారు. తాము దేశ భక్తులమని వాళ్లందరికీ ప్రజలే బుద్ధి చెబుతారు అంటూ చిందులు తొక్కారు విక్రమ్ సైనీ. ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని పార్టీతో ముడిపెట్టొద్దంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాదు ప్రజలకు జనాభా నియంత్రణ చట్టం వచ్చేంత వరకు ఆపకుండా పిల్లల్ని కంటూనే ఉండాలని లేకుంటే భవిష్యత్తులో హిందువులు మైనారిటీలోకి వెళ్లే ప్రమాదం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్న సైనీ తనకు నలుగురైదుగురు పిల్లలు కావాలని తన భార్యకు చెప్పినట్లు తెలిపారు. హిందువులంతా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటూ ఉంటే మిగతా మతస్థులు మాత్రం ఇద్దరి కంటె ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని స్పష్టం చేశారు. హిందుస్థాన్ హిందువుల దేశమని అన్నారు అంతటితో ఆగకుండా ముస్లింలు అంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలని హెచ్చరించారు.
నూతన సంవత్సర వేడుకలపైనా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సర వేడుకలు హిందూ సంప్రదాయ వేడుక కాదని, వాలెంటైన్స్ డే కూడా క్రిస్టియన్ల పండుగని, కాబట్టి హిందువులు అంతా సామూహికంగా ఆ వేడుకలను బహిష్కరించాలంటూ పిలుపునిస్తూ వివిదాల్లోకి ఎక్కారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article