ఓటమిలోనూ హ్యాట్రిక్కేనా?

57
BJP Mlc Candidate Ramchandar Rao
BJP Mlc Candidate Ramchandar Rao

BJP Mlc Candidate Ramchandar Rao

బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాంచందర్ రావుకు మంచి రికార్డే ఉంది. ఆయన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచిన తరువాత 2018 లో మల్కాజిగిరి ఎమ్మెల్యే పోటీ చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయడమేమిటి? పొరపాటున అక్కడ గెలిచి ఉంటే, ఎమ్మెల్సీగా రాజీనామా చేసేవారే కదా? అంటే, ఆయనకు గ్రాడ్యుయేట్లు అన్నా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నా చిన్న చూపే కదా? అంతటితో ఆగిండా ఈ సారు.. 2019లో మళ్లీ పార్లమెంటుకు పోటీ చేశాడు. అక్కడా ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే, రాంచందర్ రావు మీద వారికి నమ్మకం లేకపోవడమే అని తెలుస్తోంది. మళ్లీ, తాజాగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అంటే, ఒకవేళ ఇప్పుడు గెలిచినా, మళ్లీ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడనే గ్యారెంటీ లేదు కదా. అందుకే, ఈసారి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిపై గ్రాడ్యుయేట్లకు పెద్దగా నమ్మకం పెట్టుకోవడం లేదు. నిన్న జడ్చర్ల లో అడ్వకేట్స్ బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ని గెట్ ఔట్ అని తిప్పి పంపారు. అంటే, వీరికీ ఇతని మీద పెద్దగా నమ్మకం లేదన్నమాట. అయితే, ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

telangana mlc elections 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here