హోదా విషయంలో సీఎంకు హెచ్చరిక…

BJP MP GVL Reaction Over CM Jagan Writes to PM Modi
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన మంత్రి మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హోదా విషయంలో జగన్ ను హెచ్చరించిన జీవీఎల్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ప్రత్యేక హోదాపై రాజకీయాలు చేయాలని చూస్తే ఈ విషయంపై గత సర్కారుకి ఎదురైన పరిస్థితే వైసీపీకి కూడా ఎదురవుతుందని అన్నారు.హోదాకు బదులు పథకాలు, ప్రాజెక్టుల ద్వారా ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్ల నిధులు ఇచ్చిందని జీవీఎల్ చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని వివరించారు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కొత్త జీవో తెస్తే కేంద్రం నోటిఫై చేస్తుందని చెప్పారు. రాజధానిపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం కాదని అన్నారు. అయితే, రాజధానిగా అమరావతిని మార్చడం సరికాదని బీజేపీ రాజకీయ తీర్మానం చేసిందని వివరించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article