పీవీకి భారతరత్న ప్రకటించాలి

Bjp Must Announce Bharat Ratna To PV

బీజేపీ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ నగర్ లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బండి సంజయ్ పీవీ సమాధి దగ్గర రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. వరద సాయంపై రాష్ట్రం నివేదిక పంపలేదన్న కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి వాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నివేదిక పంపకుండానే వరదలు వచ్చిన 6 రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ రూ.4700 కోట్ల తక్షణ సహాయం అందించిన విషయంపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు. అంతేకాదు రోహింగ్యాల అంశంపై స్పందిస్తూ, విదేశీయులు ఉంటే అది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం తప్ప, రాష్ట్ర ప్రభుత్వానిది కాదన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం గత కొంతకాలంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంటే, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒక్క రోజు కూడా పీవీ గురించి మాట్లాడలేదన్నారు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే ఒక పార్టీ పీవీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, మరోపార్టీ దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. పీవీ సమాధి దగ్గర ఎంపీ బండి సంజయ్ రాజకీయ డ్రామాలు చేస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత, పీవీకి భారతరత్న ప్రకటించకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. పీవీ, ఎన్టీఆర్ లకు భారత రత్న ప్రకటించకుండా, జిహెచ్ఎంసీ లో ఓట్లు అడిగే అర్హత బీజేపీకి లేదన్నారు ఎమ్మెల్సీ కవిత.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేస్తున్న బీజేపీ నేతల విచిత్ర ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బీజేపీ ఎక్కడ ఎన్నికలు జరిగినా మత రాజకీయం తప్ప, డెవలప్ మెంట్ గురించి మాట్లాడదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశ జీడీపీ, డెవలప్ మెంట్ వంటి అంశాలపై స్పందించకుండా, బీజేపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కేవలం ఎన్నికల కోసం ఇష్టారీతిన మాట్లాడే పార్టీలను ప్రజలు నమ్మొద్దన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిరంతరం ప్రజల కోసమే పనిచేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

GHMC ELECTIONS UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *