రాహుల్ గాంధీని ప్రశంసించిన ఆ బీజేపీ ఎంపీ..

BJP Praises Rahul Gandhi , WHY ?

ఆ మహిళ బిజెపి ఎంపి రాహుల్ గాంధీని పొగిడారు . గతంలో రాహుల్ గాంధీని మంద బుద్ధి ఉంది అని పేర్కొన్న ఆమె ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీలో చాలా పరిణతి కనిపిస్తుంది అంటూ మాట్లాడారు. ఒకరకంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్య ఐసిసి చీఫ్ చీఫ్‌ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించి నట్టే అనిపిస్తుంది . రాహుల్ గాంధీ ఇటీవల ఏ విషయంలోనైనా ఆచితూచి ప్రవర్తిస్తున్నారని, ఆయన రాజకీయ ఎత్తుగడలను ఉద్దేశించి ఆయనలో పరిమితి కనిపిస్తోందంటూ కితాబిచ్చారు బిజెపి రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే .
ఇక ఈ మాటలు ఆమె ఎందుకు అన్నారు అంటే బీజేపీయేతర కూటమి పేరుతో మమత నిర్వహించిన యాంటీ బీజేపీ ర్యాలీ కి వెళ్ళకుండా రాహుల్ గాంధీ పరిణతి చూపించారట .. అందుకే ఆమె రాహుల్ అని పొగిడారు.
చత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అయిన పాండే కోల్ కత్తాలో జరిగిన ఐక్యత ర్యాలీ గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీని భుజాలకెత్తుకున్నారు.ఇక కోల్‌కతాలో విపక్షాల ఐక్యతా ర్యాలీపై ఆమె విమర్శలు గుప్పించారు. తన సొంత రాష్ట్రం బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని మమతా బెనర్జీ విపక్షాల ర్యాలీకి నేతృత్వం వహించడం విస్మయం కలిగిస్తోందన్నారు. బెంగాల్‌లో విపక్షాలను అణిచివేస్తున్న మమతా సమక్షంలో విపక్షాలన్నీ మోదీపై పోరాడతామని ప్రకటించడం అవివేకమని ఎద్దేవా చేశారు. బీజేపీ సత్తా ఏపాటిదో ఈ నేతలను చూస్తే అర్ధమవుతుందన్నారు.
మొత్తానికి కాసేపు పొగడ్తలతో, కాసేపు తెగడ్తల తో ముంచేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ బీజేపీ ఎంపీ సరోజ్ పాండే మోడీ గొప్పతనాన్ని చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎవరూ ఏమీ చేయలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article