టార్గెట్ సింగరేణి అంటున్న బీజేపీ

210
BJP Lost In 5 States including Jharkhand
BJP Lost In 5 States including Jharkhandet

bjp target is singareni

టీఆర్ఎస్ కు చెక్ పెట్టి తెలంగాణా రాష్ట్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది . లోక్‌సభ ఎన్నికల ఫలితాల జోష్‌తో ఉత్తర తెలంగాణలో మరింత పట్టు సాధించే దిశగా కసరత్తు  చేస్తోంది అన్న విషయం తెలిసిందే . 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలం పుంజుకుని అధికారంలోకి వస్తామంటున్న రాష్ట్ర బీజేపీ నేతలు   కారు వేగానికి  కళ్లెం  వేసే ప్రయత్నం చేస్తున్నారు.   తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. టీఆర్ఎస్‌కు ఎలాగైనా చెక్ పెట్టి తెలంగాణలో కాషాయం జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఉద్యమ నేపథ్యంతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ పునాదులు తెలంగాణలో మరింత బలపడ్డాయి. అందుకు కారణం ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుఉకుని గులాబీ బాస్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్.  క్షేత్రస్థాయిలో ప్రజాదరణ చూస్తే కారు జోరుకు ఢోకా లేదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి పావులు కదుపుతోంది. ఆ క్రమంలో తెలంగాణలో పట్టు బిగించడానికి రెడీ అవుతోంది. అదే క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో పార్టీకి జనాదరణ పెరిగిందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉనికి లేని తరుణంలో బీజేపీ నేతలు దృష్టి సారించారు. 2023 ఎన్నికల నాటికి బలపడి తెలంగాణలో అధికారం దక్కించుకుంటామని చాలా సందర్భాల్లో బీజేపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అదలావుంటే ఆ మధ్య కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లలో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని వ్యాఖ్యానించడం కాస్త ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఆ క్రమంలో స్ట్రాటజీ ప్లే చేస్తోంది. అడపా దడపా రాష్ట్రానికి కేంద్ర మంత్రులు వస్తూ బీజేపీ ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడంతో తెలంగాణలో బీజేపీకి పట్టుందనేది ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ఇంకొంచెం దృష్టి పెడితే టీఆర్ఎస్‌ను ఢీకొట్టడం పెద్ద విషయం కాదనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకులో కీలకంగా భావించే  కోల్‌బెల్ట్ ప్రాంతంలో పర్యటించడం చర్చానీయాంశమైంది.ఉత్తర తెలంగాణలో మరింత బలం పుంజుకోవాలంటే తొలుత సింగరేణి కార్మిక సంఘాలకు దగ్గర కావడంతో పాటు కోల్‌బెల్ట్ ఏరియాలో పట్టు సాధించాలనేది బీజేపీ నేతల ఆలోచనగా  కనిపిస్తోంది.  రామగుండంలో కేంద్ర మంత్రి సదానంద గౌడ పర్యటించినప్పుడు స్థానిక టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడం బీజేపీ స్ట్రాటజీలో భాగమని తెలుస్తోంది.అంతే కాదు సింగరేణిలో బలోపేతం కావాలని కొందరు సింగరేణి యూనియన్ సంఘాల లీడర్లను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఇటీవల కిషన్ రెడ్డి పర్యటన సైతం  ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకే టార్గెట్ సింగరేణి అంటుందని చర్చ జరుగుతుంది.

tags :telangana, singareni, coal belt, ramagundam, bjp, kishan reddy, sadananda gowda, trs

ఆసక్తికరంగా క్యాబినెట్ భేటీ..

నీలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ పై కమిటీ విచారణ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here