బండి సంజ‌య్ ప్ర‌జా ద‌గా యాత్ర‌

బీజేపీ, టీఆర్ఎస్ లు డబుల్ గేమ్ ఆడుతున్నాయని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి
విమ‌ర్శించారు. బండి సంజ‌య్ చేస్తున్న‌ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. ప్రజా దగా యాత్ర చేస్తున్నాడని‌ విమర్శలు గుప్పించారు. బండి పాదయాత్రలో పస లేదు.. ఆయన ప్రజలు గుర్తించటం లేద‌న్నారు. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని కేంద్రం గుర్తించిన తర్వాతనే అమిత్ షా తెలంగాణలో పర్యటించాలని సూచించారు. బీజేపీతో కేసీఆర్ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని విమ‌ర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల‌ని కోరారు. ఎంఐఎంతో దోస్తీ కారణంగానే కేసీఆర్ సెప్టెంబరు17ను అధికారికంగా నిర్వహించటంలేద‌ని ఆరోపించారు. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుముతోందన్నారు. తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11నుంచి 17వరకు సాయుధ అమరులకు నివాళి కార్యక్రమాలు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article