టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్.. PART 03

సింహయాజి: ఫోన్ చేసి గ్యారెంటీ ఏంటని నందు అడిగాడు. నేను వెంటనే అక్కడికి పంపించా. ఈ స్వామీజీ దగ్గరికి వెళ్లి ఆయనని పరిచయం చేసుకొమ్మని పంపించా. నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ పని చేయమని చెప్పా.
నందు: మరి చూడకుండా నేనెలా చెప్తాను? నాకు ఈ పార్టీతో ఏ సంబంధం లేదు. నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను అవతలి వారికి ఎలా చెప్పాలి? అప్పుడు అక్కడికి వెళ్లి వచ్చాక కన్ ఫమ్ చేసుకున్నా. ఆ విషయం చెప్పిన తర్వాత అందరూ నన్ను స్వామీజీతో కూర్చుందామా అని అడిగారు. బండి సంజయ్ కి కూడా తెలియదు.
సింహయాజి: బండి సంజయ్ ఇందులో అసలు లేడు.
నందు: బండి సంజయ్ ది ఇక్కడేం నడవదు. వాళ్లకు అసలు అపాయింట్ మెంటే దొరకదు.
గువ్వల బాలరాజు: ఇక్కడ స్టేట్ లీడర్లతో ఏం కాదంటారా?
నందు: అస్సలు కాదు.
గువ్వల బాలరాజు: బండి సంజయ్ మొత్తం నేనే చేస్తా అని చెప్పుకుంటాడు కదా?
నందు: అలాంటిదేమీ లేదు. అక్కడ ఒకటే నిమిషంలో బండి సంజయ్ స్థానంలో మీ పేరు రాస్తే.. రేపటి నుంచి మీరిక్కడ పనిచేసుకోవచ్చు. కిషన్ రెడ్డి కూడా దిగిపోవాలంటే దిగిపోవాల్సిందే. బీఎల్ సంతోష్ అంత పవర్ ఫుల్ అక్కడ.
సింహయాజి: అక్కడ అంతా బీఎల్ సంతోష్ క్యాండెట్లే ఉన్నారు. అర్థమయ్యిందా?
గువ్వల బాలరాజు: మరి అమిత్ షా?
సింహయాజి: అమిత్ షా, సంతోష్ ఒకటే కదా? ఇంకోటి. బీఎల్ సంతోష్ నో అని చెప్తే అమిత్ షా ఏమీ చేయలేడు. అంత పవర్ ఫుల్ ఆయన అక్కడ.
హర్షవర్ధన్ రెడ్డి: పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కదా?
సింహయాజి: పార్టీ అధ్యక్షుడు కూడా ఈయన చెప్పినట్టే వినాలి. బీఎల్ సంతోష్ అంత పవర్ ఫుల్. కేబినెట్ మీటింగ్ లో కూడా బీఎల్ సంతోష్ మాటే నడుస్తుంది. ప్రతీ కేబినెట్ మీటింగ్ లో బీఎల్ సంతోష్ కూర్చుంటాడు.
గువ్వల బాలరాజు: ఆయన మినిస్టరా?
సింహయాజి: కాదు. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ.
గువ్వల బాలరాజు: కేబినెట్ మీటింగ్ లో కూర్చుంటాడా?
నందు: ఆయన అశోకా వీధిలో ఉంటాడు. మోదీ, అమిత్ షా మాట్లాడాలి అనుకుంటే ఫోనులో మాట్లాడతాడు. లేదంటే వాళ్లే వచ్చి వెళ్తారు.
సింహయాజి: ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో ఆయనకు అంత ప్రాధాన్యత ఉంది. బీఎల్ సంతోష్ చాలా పవర్ ఫుల్.
నందు: ఢిల్లీలో సంతోష్ ను కలిసి వచ్చిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు నాకు కలిశాడు. మేం 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా మాకు ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదు. మీకెలా దొరికిందని షాకయ్యాడు. అదంతా స్వామీజీ దయ అని చెప్పా.
గువ్వల బాలరాజు: స్వామీజీ అంత పవర్ ఫులా?
సింహయాజి: బీజేపీని ఆర్గనైజ్ చేసేది స్వామీజీనే. అందుకే వీళ్లంతా వెళ్లి స్వామీజీలను మొక్కుతుంటారు.
నందు: వీళ్లు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతారు. మోడీ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని చెప్తుంటారు.
సింహయాజి: స్వామీజీకి లుకేమియా ఉంది.
గువ్వల బాలరాజు: ఎవరికి?
సింహయాజి: రామచంద్రభారతి స్వామీజీకి లుకేమియా ఉంది.
గువ్వల బాలరాజు: వాళ్ల రాష్ట్రంలో లుకేమియాకు చికిత్స ఉంది కదా?
సింహయాజి: కేవలం ఆయన గోమూత్రం మాత్రమే తీసుకుంటారు.
గువ్వల బాలరాజు: స్వామీజీది ఎక్కడ?
నందు: కర్ణాటక
గువ్వల బాలరాజు: ఇంతకీ ఈయన నేటివ్ ఎక్కడ?
సింహయాజి: ఈయన, సంతోష్ ఇద్దరూ కర్ణాటక వారే.
నందు: ఆర్ఎస్ఎస్ లో నంబర్ వన్ మోహన్ భగవత్. నంబర్ 2 దత్తాత్రేయ బస్వరాజ్. నంబర్ 3 బీఎల్ సంతోష్. ఆయనది కర్ణాటక. దత్తాత్రేయ బస్వరాజ్ ది కూడా కర్ణాటకే. వీళ్లతోపాటు అమిత్ షా కూడా నిర్ణయాలు తీసుకుంటారు.
సింహయాజి: వీళ్లందరూ ఒప్పుకొని బీఎల్ సంతోష్ ఒక్కరూ ఒప్పుకోకపోతే పని కాదు.
గువ్వల బాలరాజు: ఏంటి? ప్రధాని ఒప్పుకున్నా కూడానా?
సింహయాజి: అవును. సంతోష్ ఒప్పుకోకపోతే అంతే. బీఎల్ సంతోష్ నో అంటే నో. అంతే!
నందు: చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టు వరకు ప్రతీ ఒక్కటి ఆయనే నిర్ణయిస్తారు.
సింహయాజి: సంతోష్ ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివారు.
గువ్వల బాలరాజు: మీరేం చదువుకున్నారు?
సింహయాజి: నేను ఎంఏ లిటరేచర్.
గువ్వల బాలరాజు: మా అచ్చంపేటలో కూడా చాలా మంది స్వాములు ఉన్నారు. వాళ్లు చదువు మానేసి మొత్తం ఇదే. వేద పాఠశాలకు వెళ్లడం, చదువుకోవడం!
రోహిత్ రెడ్డి: వేద పాఠశాలలో కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. వేద పాఠశాలలో కూడా సోషల్, సైన్స్ సహా అన్ని సబ్జెక్టులు ఉంటాయి.
సింహయాజి: మా పీఠం చాలా డిఫరెంట్.
గువ్వల బాలరాజు: మీ పీఠం పేరేంటి స్వామీజీ?
సింహయాజి: శ్రీ మంత్రరాజ పీఠం.
నందు: నరసింహ ఉపాసకులు. వీళ్ల గురువుగారు చతుర్వేది గారు. ఒకసారి యోగి(యూపీ సీఎం)ని ఇలా రా అని పిలిచి..
సింహయాజి: అప్పుడు యోగి ఎంపీగా ఉన్నారు. అప్పుడు మా గురువు గారు పిలిచి ఒక సాలగ్రామం ఇచ్చి, ఒరేయ్ నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పారు. అంత పవర్ ఫుల్ మా గురువు గారు.
గువ్వల బాలరాజు: ఏం పేరు?
నందు: చతుర్వేది గారు.
సింహయాజి: ఇవన్నీ అయిపోయాక ఒకసారి కొండకు రండి. అన్నీ మాట్లాడుకుందాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article