టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎలా ట్రాప్ చేసిందంటే?

రోహిత్ రెడ్డి: మేమంతా రెడీగా ఉన్నాం. ఇప్పటికే మొత్తం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్తే వాళ్లకి నమ్మకం వస్తుంది.
రోహిత్ రెడ్డి: మేమొకటి మాట్లాడుతున్నాం. మీరొకటి చెప్తున్నారు.
రామచంద్రభారతి: ఇక్కడి నుంచి మాకు కొంచెం కావాలని రోహిత్ అడిగారు. మిమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్లి జాయిన్ చేసుకుంటామని చెప్పాం. మనం మాట్లాడుకున్నదంతా పైవాళ్లకి మెసేజ్ చేశాను. వాళ్ల రిప్లై కోసం ఎదురుచూస్తున్నాం.
రోహిత్ రెడ్డి: అమౌంట్ గురించి కూడా ఓపెన్ గా చెప్పండి.
రామచంద్రభారతి: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తాం.
గువ్వల బాలరాజు: 50 అంటే..?
రోహిత్ రెడ్డి: రూ.50 కోట్లు
సింహయాజి: మీరు రూ.50 లక్షలు అనుకున్నారా? కాదు రూ.50 కోట్లు.
రోహిత్ రెడ్డి: మనం మాట్లాడుకున్నదంతా పైవాళ్లకి మెసేజ్ చేశారట. వాళ్ల రిప్లై కోసం ఎదురుచూస్తున్నారు.
రామచంద్రభారతి: మీకు ఇక్కడే డెలివరీ కావాలా?
గువ్వల బాలరాజు: మిగిలిన వాళ్ల గురించి కూడా మాట్లాడుదామా?
సింహయాజి: మొదట మీ విషయం పూర్తి కానివ్వండి. తర్వాత వాళ్లది చూద్దాం.
సింహయాజి: మీకు ఎక్కడ డెలివరీ కావాలంటే అక్కడ ఇస్తాం.
నందు: స్వామీజీ మరో ఐదుగురైనా ఓకేనా? వాళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
రామచంద్రభారతి: వాళ్లు ఎంత అడుగుతున్నారో కరెక్టుగా మాకు తెలియాలి.
రోహిత్ రెడ్డి: అన్నా మూడు విషయాలు అడిగిన. ఒకటి- రాజకీయ భవిష్యత్తు.
గువ్వల బాలరాజు: మాకు కూడా సేమ్ అడిగినవా?
రోహిత్ రెడ్డి: తర్వాత ఎన్నికల్లో బీ ఫామ్స్ కూడా వీళ్లే ఇచ్చేలా చూడాలి.
రామచంద్రభారతి: మీ వైపు నుంచి మీరు క్లియర్ గా ఉంటే మా వైపు నుంచి మేము పూర్తి సహకారం అందిస్తాం. బీ ఫామ్ ల గురించి ఇప్పుడే కాదు.. తర్వాత చూసుకుందాం.
రామచంద్రభారతి: బీజేపీలో అన్ని వ్యవహారాలను చూసుకునే ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలతో ఎవరికీ సంబంధం ఉండదు. మొత్తం జాతీయ నేతలే చూసుకుంటారు. ఒకరు బీఎల్ సంతోష్, రెండు అమిత్ షా, మూడు జేపీ నడ్డా.
గువ్వల బాలరాజు: మరి ప్రధాని జోక్యం చేసుకోడా?
రామచంద్రభారతి: అలాంటిదేమీ ఉండదు. ఇలాంటి నిర్ణయాల్లో ప్రధానికి అధికారం ఉండదు. ఇలాంటి వ్యవహారాలను ప్రధాని పైనుంచి పర్యవేక్షిస్తుంటారు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయనకు అప్ డేట్స్ వెళ్తూనే ఉంటాయి.
గువ్వల బాలరాజు: ప్రధాని ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతుంటాయా?
రామచంద్రభారతి: అందరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. అందరూ కలిసే, అందరికీ తెలిసే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి.
గువ్వల బాలరాజు: సమాజంలో ఒక అపోహ ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ వేర్వేరు అని..
రామచంద్రభారతి: అవును. నిజమే. వాటి మధ్య తేడాలున్నాయి. ఆర్ఎస్ఎస్ అనేది పొలిటికల్ లిస్టింగ్ ఆర్గనైజేషన్. బీజేపీ అనేది పొలిటికల్ పార్టీ.
రామచంద్రభారతి: ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఆర్గనైజేషన్ మాత్రమే. కానీ ప్రతీ బీజేపీ వ్యక్తి వెనక ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంటుంది.
గువ్వల బాలరాజు: ప్రధానికి కూడానా?
రామచంద్రభారతి: అవును. ప్రధాని కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారక్. అక్కడి నుంచే ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీగా మారారు. అక్కడ్నుంచి గుజరాత్ సీఎంగా పదవి చేపట్టారు.
గువ్వల బాలరాజు: మూడుసార్లు సీఎంగా చేసిన తర్వాత ప్రధాని అయ్యారు కదా?
రామచంద్రభారతి: అవును. మూడుసార్లు సీఎం చేశాక ప్రధాని అయ్యారు. ఇదంతా బీజేపీ పనిచేసే విధానం. రాజకీయపరంగా వస్తే ఇక్కడ వ్యవహరాలన్నీ అమిత్ షా, బీఎల్ సంతోష్, నడ్డా చూసుకుంటారు.
రామచంద్రభారతి: తొలుత ప్రతీ విషయాన్ని బీఎల్ సంతోష్ పర్యవేక్షిస్తారు. ఆయన ఆ అంశాలపై అమిత్ షా, నడ్డాతో చర్చించి అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు.
రామచంద్రభారతి: నాకు ఈ మొత్తం వ్యవహారం గురించి సమాచారం రాగానే సంతోష్, తుషార్, అమిత్ షాకు మెసేజ్ చేశాను. ఇప్పుడు అమిత్ షా గుజరాత్ లో ఉన్నారు. అక్కడ పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. సంతోష్, తుషార్ కూడా గుజరాత్ లోనే ఉన్నారు. కానీ వీళ్లంతా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారు.
రామచంద్రభారతి: దీనిపై వాళ్లందరికీ మెసేజ్ చేశాను. మాట్లాడుతున్నారు. తుషార్ కు ఇప్పుడే నేను ఫోన్ చేశాను. అమిత్ షాతో మాట్లాడారంట. మరో 30 నిమిషాల్లో మనకు కాల్ చేస్తారు. ఇక్కడికి రావడానికి ముందే మేమంతా మాట్లాడుకున్నాం. మీరు అడిగిన వాటన్నింటికీ వాళ్లు ఒప్పుకున్నారు. ఇందులో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు.
రామచంద్రభారతి: మిమ్మల్ని చూసేంత వరకు నేనేమీ చెప్పలేను. కాబట్టి హామీ ఇవ్వలేదు. జాతీయ పార్టీలోకి వస్తున్నారంటే ఆషామాషీ కాదు. మీరు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి వచ్చారు. గతంలో మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. అవి కూడా జాతీయ పార్టీలే. ఇక్కడ కూడా అదే విధంగా నిర్మాణ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి నేను వివరాలన్నింటినీ పైవాళ్లకు చెప్పాను. వాళ్లు ఒప్పుకున్నారు.
గువ్వల బాలరాజు: మరి మునుగోడు ఎన్నికల సంగతేంటి?
రామచంద్రభారతి: అక్కడ బీజేపీ లీడింగ్ లో ఉంది. వందకు వంద శాతం గెలుస్తాం.
నందు: స్వామీ. బీఎల్ సంతోష్ గురించి వారికి చెప్పండి.
సింహయాజి: బీఎల్ సంతోష్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.
గువ్వల బాలరాజు: ఆయన గురించి నాకు తెలియదు. రోహిత్ మమ్మల్ని పిలిచాడు. మేం ఇక్కడికి వచ్చాం. అవన్నీ మేం తెలుసుకోలేదు.
రామచంద్రభారతి: ఆయనే ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయన కాంగ్రెస్ లో సుర్జీవాలా తరహాలో పనిచేస్తుంటారు. అక్కడ సుర్జీవాలా ఎలాగో ఇక్కడ సంతోష్ అలా! కానీ ఇక్కడ సుర్జీవాలా కంటే బీఎల్ సంతోష్ చాలా పవర్ ఫుల్.
రామచంద్రభారతి: బీజేపీకి సంబంధించిన వ్యూహాలను పూర్తిగా అమలు చేసేది బీఎల్ సంతోష్. ఎవరికి బీ ఫామ్ ఇవ్వాలన్నా వారికే పూర్తి అధికారం ఉంటుంది.
గువ్వల బాలరాజు: కానీ మేము బీ ఫామ్ ల కోసం ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు కదా?
రామచంద్రభారతి: అలాంటిదేమీ ఉండదు. రాబోయే ఎన్నికల్లో మీకు బీ ఫామ్ తప్పకుండా వస్తుంది. రాజకీయపరంగా కావాల్సిన అన్ని అవసరాలను చూసుకుంటాం. కేంద్రం నుంచి గానీ రాష్ట్రం నుంచి గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఈ మూడింటిపై మీకు హామీ ఇస్తున్నాం. మీటింగ్ పూర్తయ్యేలోపే వాటన్నింటిపై మీకు క్లారిటీ ఇస్తాం. ఆ తర్వాతే మనం ముందుకెళ్దాం.
రామచంద్రభారతి: ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు టెన్షన్ పడుతున్నారు. నాకు కూడా కొంత టెన్షన్ గా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజంతా నా ఫోన్ స్విచాఫ్ చేశాను. మీకు పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకెళ్లండి. అప్పటివరకు ఎక్కడికీ వెళ్లకండి.
గువ్వల బాలరాజు: మేం రాష్ట్ర నాయకులతో టచ్ లో ఉండాలా?
రామచంద్రభారతి: దాని గురించి మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. మీరు కేవలం రోహిత్ తో మాత్రమే టచ్ లో ఉండండి. ఆయన ఎప్పటికప్పుడు మమ్మల్ని సంప్రదిస్తుంటాడు.
రోహిత్ రెడ్డి: మనకు మొత్తం ఇక ఢిల్లీ నుంచే. ఇప్పుడు స్వామీజీకి ఈ బాధ్యత అప్పగించారు. నిజానికి కర్ణాటక, మహారాష్ట్ర ఆపరేషన్ చేసింది ఆయనే.
రామచంద్రభారతి: కర్ణాటక ఆపరేషన్ గురించి మీకు తెలుసు కదా? కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి 16 మందిని తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.
గువ్వల బాలరాజు: గతంలో కుమారస్వామి ప్రభుత్వం ఉండేది. ఆయనను దించి మీరు వచ్చారు కదా?
రామచంద్రభారతి: అవునవును. చూడండి. కర్ణాటకకు, తెలంగాణకు చాలా తేడా ఉంది. తెలంగాణ, ఆంధ్రాల్లో మిగిలిన రాష్ట్రాల్లోని రాజకీయాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి.
రామచంద్రభారతి: ఇక్కడ ఒక్క నియోజకవర్గం ఎన్నిక ఖర్చుతో అక్కడ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక పూర్తవుతుంది. ఇక్కడ ఒక నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తే.. అక్కడ 7 నుంచి 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు.
గువ్వల బాలరాజు: మునుగోడులో ఎంత ఖర్చు చేస్తున్నారు?
రామచంద్రభారతి: నేను అదే చెప్తున్నా. తెలంగాణలో ఒక్క నియోజకవర్గంలో పెట్టే ఖర్చుతో వేరే రాష్ట్రంలో ఎన్నికలన్నీ పూర్తి చేసుకోవచ్చు.
గువ్వల బాలరాజు: ఇంతకీ మునుగోడులో ఎంత ఖర్చు చేస్తున్నారు?
రామచంద్రభారతి: చూడండి. సిటింగ్ పార్టీ వారివారి వ్యూహాలతో వెళ్తుంది. ఎందుకంటే.. రాష్ట్ర ఇంటలిజెన్స్, పోలీసులు, స్థానిక నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇవన్నీ కేంద్రం చేతిలో ఉండవు. కేంద్రం నుంచి ఇక్కడి ఎన్నికలను మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు.
రామచంద్రభారతి: ఏదైతే ఏముంది? టీఆర్ఎస్ ఎలాగూ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది. టీఆర్ఎస్ కాదు.. బీఆర్ఎస్. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం వారికి ఉంది.
గువ్వల బాలరాజు: బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా?
రోహిత్ రెడ్డి: అయిపోయింది. ఫామ్స్ అన్నీ సమర్పించారు. ఇంకా అప్రూవల్ రాలేదు.
రామచంద్రభారతి: బీఆర్ఎస్ పేరు రాదు లెండి. బీఆర్ఎస్ అనేది చాలా కష్టం లెండి. ఇప్పటికే బీఆర్ఎస్ అనే కోడ్ నేమ్ మీద నాలుగు పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. దాన్ని ఎవరో ఒకరు ఆపే అవకాశముంది. దాన్ని మేము ఆపం. ఆటోమేటిగ్గా వ్యవస్థ ప్రకారం అదే ఆగిపోతుంది.
రోహిత్ రెడ్డి: మహారాష్ట్ర ఎపిసోడ్ ను కూడా స్వామీజీ చూసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article