మున్సిపల్ ఎన్నికల్లో  బీజేపీకి అభ్యర్థులు కరువు

BJP Will Not Impacts On Municipal Poll

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమేనని  చెప్పుకునే కమలనాథులు మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేక  ఇబ్బంది పడుతున్నారు .తెలంగాణ వ్యాప్తంగా వున్న మునిసిపాలిటీల్లోని 30 శాతం వార్డుల్లో బీజేపీ తరపున నామినేషన్లు వేసే అభ్యర్థులు దొరకలేదని తెలుస్తోంది. అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కమలనాథులు అభ్యర్థులే దొరకని పరిస్థితి కనిపించడంతో షాక్ అవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,727 వార్డులుండగా.. 30శాతం స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు దొరకలేదని అంటున్నారు. దాంతో అభ్యర్థులు దొరకని స్థానాల్లో ఇతర పార్టీల రెబల్స్‌కు బీజేపీ టిక్కెట్ ఇచ్చే అంశంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. తమను ఆశ్రయించే ఇతర పార్టీల రెబల్స్‌కు వెంటనే టిక్కెట్ ఇవ్వడంతోపాటు ఆర్థిక సాయం కూడా చేసేలా వ్యూహరచన చేస్తోంది కమలదళం.  శనివారం పార్టీ సమీక్షా సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ క్లస్టర్ ఇంఛార్జిలపై కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఇచ్చిన సమాచారం మేరకు  ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అర్బన్ ప్రాంతాల్లో తమకు పట్టుందని చెప్పుకునే బీజేపీ నేతలు.. ఏకంగా హైదరాబాద్ శివారుల్లోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం లాంటి నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టలేకపోవడంతో  కిషన్ రెడ్డి  తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతుంది.

BJP Will Not Impacts On Municipal Poll,municipal elections, trs alternative , bjp, kishan reddy , candidates  problem , telangana,telangana politics

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article