బీజేపీకి 270 స్థానాలు ఖాయం

140
BJP WILL WIN 270 SEATS
BJP WILL WIN 270 SEATS

BJP WILL WIN 270 SEATS

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధీమా
  • ప్రధాని రేసులో లేనని పునరుద్ఘాటన

ఈ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 270 సీట్లు ఖాయమని ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తంచేశారు. మిత్రపక్షాలతో కలిసి బీజేపీకి 300కి పైగా స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. సోమవారం నాగ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ గెలుపు ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కనీసం 270 స్థానాలు గెలుచుకుంటుందని, మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి 40 సీట్లలో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. తాను ప్రధాని పదవి రేసులో ఉన్నానంటూ వస్తున్న కథనాలను గడ్కరీ తోసిపుచ్చారు. తాను ప్రధానమంత్రి పదవి రేసులో లేనని గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. ఇవన్నీ వదంతులేనని.. ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో ప్రధాని కావాలనుకుంటున్నాని ఎక్కడా వ్యాఖ్యానించలేదని తెలిపారు. ప్రస్తుతం తాను ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నాన్నారు. పార్టీ ఎటువంటి బాధ్యతను అప్పగించినా.. సమర్థంగా నిర్వర్తించడమే తన కర్తవ్యమని వెల్లడించారు.

NATIONAL NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here