తండ్రికి బ్లాక్ ఫంగస్.. వదిలేసిన కొడుకు

వికారాబాద్ జిల్లాలోని పరిగిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండటంతో అతన్ని కొడుకు వదిలేశాడు. వివరాల్లోకి వెళితే.. రుక్కుంపల్లికి చెందిన చంద్రయ్య (63) ఈ నెల మూడున కరోనా పాజిటివ్ సోకింది. తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, బుధవారం ఆయనలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. కన్ను, నుదుటి భాగంలో వాపు, ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో, తన వల్ల కాదంటూ కొడుకు వదిలేశాడు. ఈ విషయం తెలియని ఆ తండ్రి.. తన కొడుకు వస్తాడంటూ ఎదురు చూస్తున్నాడు. దీంతో, ఆయన్ని మహవీర్ ఆసుపత్రికి పంపించేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article