నెల్లూరులో నల్ల కోడిని బలిచ్చి?

BlackMagicInNellore
నెల్లూరు జిల్లాలో క్షుద్ర పూజలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. కోవూరు మండలం పడుగుపాడులో ఉన్న  క్రికెట్ మైదానంలో  అర్థరాత్రి  ఎవరో క్షుద్రపూజలు చేసారని స్థానికులు భయపడుతున్నారు.  మైదానంలో పెద్ద బొమ్మ గీసిన మంత్రగాళ్లు.. నల్లకోడిని బలిచ్చి క్షుద్రపూజల తంతు కొనసాగించారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.నిత్యం గ్రామంలోని యువత ఈ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటారు . కానీ నేడు గ్రౌండ్ లోకి వెళ్లి చూడటంతో అక్కడ క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్ళు కనిపించాయి. దీంతో  రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు పాల్పడిన వారెవరో తెలుసుకునే పనిలో పడ్డారు. గ్రామానికి చెందిన వాళ్ళు చేసిన పనా, లేకా ప్రకా గ్రామాల నుండి ఎవరైనా చేశారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. అసలు ఆ క్రీడా మైదానంలో చెయ్యాల్సిన అవసరం ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పని చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
tags: #Andhra pradesh,#nellore, #padugupadu, occult rituals, black magic, toy, black hen, cricket ground, people, complaint, police inquiry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *