అక్రమ వసూళ్లను ఆపండి

80

అక్రమ వసూళ్ల కు పాల్పడుతున్న వారి నుండి తమను కాపాడాలని బొడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల మేకలమండి మొండెదారు సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. శనివారం కార్పొరేటర్ లు రసాల వెంకటేష్ యాదవ్, బింగి జంగయ్య యాదవ్ ల ఆధ్వర్యంలో మొండెదారు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిన్న బాలయ్య యాదవ్, ముఖ్య సలహాదారు పోచయ్య, సభ్యులు లింగస్వామి యాదవ్, బాబు కుర్మ, స్వామి కుర్మ లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. కబేలా బయట తాము గొర్రెలు, మేకలను విక్రయించుకొని జీవనం సాగిస్తున్నామని మంత్రికి వారు వివరించారు. కాగా కబేలా కు సంబంధం లేని వ్యక్తులు తమపై దౌర్జన్యం చేస్తూ ఎలాంటి రశీదులు ఇవ్వకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మంత్రికి పిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఈ విషయంపై తగు విచారణ జరిపి స్తామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here