ఇండస్ట్రీలో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడికి బాలీవుడ్ నుంచి పిలుపురావడం అనేది కామన్. మరి పుష్ప2 లాంటి హిట్ కొట్టిన సుకుమార్‌కి మాత్రం ఇప్పటివరకు హిందీ హీరోల నుంచి పిలుపు రాలేదు. ఈ అనుమానం ప్రస్తుతం అందరి మదిలో మెదులుతుంది. ప్రస్తుతం ఈ ప్రశకు సమాధానంగా సుక్కూకు కింగ్‌ఖాన్ నుంచి పిలుపు వచ్చింది. సుకుమార్ టేకింగ్, మాస్ ఎలివేషన్స్‌కు షారూక్ ఫిదా అయ్యారట.
వెంటనే సుకుమార్‌కు కబురు పెట్టాడట. ఇక సుక్కూ బాలీవుడ్‌బాద్‌షా కలిసి ఓ రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా చేయడానికి రెఢీ అవుతున్నట్లు సమాచారం. కుల- వర్గ పోరాటాల నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందట. ఇక మన బాద్‌షా కాస్త నెగెటివ్ ఛాయల్లో కూడా కనిపిస్తాడట. కాకపోతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఆల్రెడీ చరణ్‌తో సినిమా తీయడానికి సుక్కు ప్రిపరేషన్‌లో ఉన్నాడు. ఆ తరువాత పుష్ప3 హడావిడి ఉంటుంది. ఈ రెండు సినిమాలు అయితేగాని షారూక్‌తో తీయలేడు మరి.