బోర్డర్ ను క్యాష్ చేసుకుంటోన్న బాలీవుడ్

32
bollywood eye on boarder
bollywood eye on boarder

bollywood eye on boarder

ఒరిజినల్ కంటెంట్స్ తో సినిమాలు చేయడంలో బాలీవుడ్ తర్వాతే ఎవరైనా. బయోపిక్స్ నుంచి రియల్ ఇన్సిడెంట్స్ వరకూ బాలీవుడ్ లో వచ్చే సినిమాలు ఇతర భాషల్లో సైతం ఆకట్టుకుంటుంటాయి. గతంలో కార్గిల్ వార్, అంతకు ముందు భారత్ చేసిన కొన్ని యుద్ధాల నేపథ్యంలో బాలీవుడ్ లో సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా కూడా సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరి’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి జాతీయ అవార్డులు సైతం దక్కించుకుంది. ఇక లేటెస్ట్ గా చైనాతో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో కూడా సినిమా మొదలు కాబోతోంది. ఈ మూవీలో స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్  నిర్మించచబోతుండటం విశేషం. కాకపోతే ఈ మూవీలో ఆయనే హీరోగా నటిస్తాడా లేక మరెవరినైనా తీసుకుంటాడా అనేది  అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. అజయ్ దేవ్ గణ్ గతంలో భగత్ సింగ్ బయోపిక్ లో అద్భుతంగా నటించాడు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు.

దేశభక్తి చిత్రాలకు అజయ్ పెట్టింది పేరుగా కనిపించాడు. విశేషం ఏంటంటే.. ప్రస్తుతం అజయ్ నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ‘భుజ్ – ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా కూడా సరిహద్దుల నేపథ్యంలో సాగే దేశభక్తి చిత్రమే. అందుకే ఆయన ఎంపిక పర్ఫక్ట్ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అజయ్ వద్దు అక్షయ్ కుమార్ కావాలి అంటూ ట్విట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. జూన్ 15న అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్, చైనా సైనికుల బాహాబాహీగా తలపడిన నేపథ్యంలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఇక తెలుగు వాడైన కల్నల్ సతీష్ బాబు మరణం కూడా దేశవ్యాప్తంగా ఓ రకమైన భావోద్వేగాన్ని రగిలించింది. ఈ నేపథ్యంలో సినిమా.. అది కూడా ఇంకా ఆ వేడి ఉండగానే అంటే ఖచ్చితంగా.. పక్కా పైసా వసూల్ మూవీ అవుతుందనుకోవచ్చు. ఏదేమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ను బాలీవుడ్ అద్భుతంగా క్యాష్ చేసుకుంటుందనే చెప్పాలి.

bollywood news

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here