BOLLYWOOD STARS ACTING IN RRR
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. షూటింగ్ జరుగుతోంది. డివివి.దానయ్య నిర్మిస్తున్నారు.`బాహుబలి` తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా రాజమౌళి సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ను ఓ గెస్ట్ పాత్రలో నటింప చేస్తున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం అజయ్ `తానాజీ` సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తాడని సమాచారం.
For More Click Here
More Latest Interesting news