శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం!

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం రేగింది. శబరిమల ఆలయ పరిసర ప్రాంతంలో పేలుడు పదార్థాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్‌ఘాట్‌ వంతెన కింద మొత్తం 6 జిలెటిక్‌స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బాంబు స్క్వాడ్‌ సాయంతో అయ్యప్ప ఆలయ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల మకరజ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చిన సంగతి తెలిసిందే. మకర జ్యోతి దర్శనం అనంతరం ఇవాళ్టి నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article