bond movie postponed
కరోనా దెబ్బకు అన్ని సినిమా పరిశ్రమలూ విలవిలలాడాయి. ముఖ్యంగా హాలీవుడ్. ఆ సినిమాల్లో ఎన్నో ఉత్పాతాలను సూపర్ హీరోస్ ఆపుతారు. కానీ కరోనాను ఆపే సూపర్ పవర్ మాత్రం వారికీ లేకుండా పోయింది. అందుకే ఎన్నో సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ముఖ్యంగా వాల్డ్ వైడ్ గా విపరీతమైన అభిమానులున్న జేమ్స్ బాండ్ మూవీ కూడా. ఈ ఏప్రిల్ లో వస్తుందన్న ఈ మూవీ డిసెంబర్ కు వెళ్లింది. లేటెస్ట్ గా డిసెంబర్ నుంచీ పోస్ట్ పోన్ అయిందీ చిత్రం జేమ్స్ బాండ్.. టెక్నాలజీ పెద్దగా డెవలప్ కాని రోజుల్లోనే అద్భుతాలు చేసిన సినిమా సిరీస్. బాండ్.. జేమ్స్ బాండ్ అంటూ ఆరడగుల హీరో స్టైలిష్ చెబుతూ అనేక అవరోధాలను అవలీలగా అధిగమించిన విధానానికి నాటి నుంచి నేటి వరకూ బాండ్ కు ఎంతోమంది అభిమానులు వచ్చారు.
నేటి సూపర్ హీరోస్ తో పోటీలో కాస్త వెనకబడ్డా ఈ సారి ‘నో టైమ్ టు డై’ అనే సినిమాతో వస్తున్నాడు జేమ్స్ బాండ్. డేనియల్ క్రెయిట్ నాలుగోసారి బాండ్ గా నటించిన సినిమా ఇది. నో టైమ్ టు డై … ఈ యేడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమా. కానీ కరోనా కారణంగా డిసెంబర్ మూడో వారానికి పోస్ట్ పోన్ చేశారు. అయితే కరోనా ఇంకా తన ప్రభావం చూపుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇంకా సినిమా థియేటర్స్ ఓపెన్ కావడం లేదు. ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న బాండ్ సినిమా అంటే వాల్డ్ వైడ్ గా విడుదల చేయాల్సిందే. అందుకే వచ్చే యేడాది ఏప్రిల్ 2న బాండ్ ను విడుదల చేస్తాం అని ప్రకటించారు. అంటే ఏకంగా యేడాది ఆలస్యంగా ముందు చెప్పిన టైమ్ కు విడుదలవుతుందన్నమాట.