BONEY KAPOOR ISSUED NOTICES TO PRIYA WARRIER
ఓరు ఆధార్ లవ్ సినిమాలో ఓ పాటలో కన్నుగీటతో నేషనల్ పేమస్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్, శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి దర్శక నిర్మాతలకు శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నోటీసులు పంపారు. ప్రశాంత్ మాంబుల్లి దర్శకుడు. టీజర్‌ను చూస్తుంటే అందులో కొన్ని సన్నివేశాలు.. చివరల్లో బాత్ టబ్‌లో పడి ఉన్నట్లుగా కాళ్లు చూపించే సన్నివేశాలు శ్రీదేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమా అనేలా సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బోనీ కపూర్ నోటీసులు పంపారు. “శ్రీదేవి అనే పేరును ఎవరైనా పెట్టుకుంటారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. బోనీకపూర్ నుండి నోటీసులు వచ్చాయి. దీన్ని మేం ఎదుర్కొంటాం“ అని దర్శకుడు అంటే.. “నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్ పాత్రలో నటిస్తున్నాను. శ్రీదేవిగారి సినిమానా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే` అన్నారు ప్రియా వారియర్.