వర్షాలు తగ్గిన సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని.. గత ఐదేళ్ల క్రితం ఇలాగే డెంగ్యూ వ్యాధి విజృభించిందని ఆరోగ్య మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రభలుతున్న సీజనల్ వ్యాధులపై అన్ని జిల్లాల కలక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరొనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వనికి సహకరించాలని.. ఈ మేరకు ప్రజలందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రతీనీధులు అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. వరదల వల్ల ఏర్పడిన కరెంటు ఇబ్బందులకు సంబంధిత శాఖలకు పది, పది కోట్లు విడుదల చేశామన్నారు. వరదల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలనీ కోరారు.
మంకీ పాక్స్ ఒక్కరికే
మంకీ పాక్స్ వ్యాధి కి సంబంధించి ఒక వ్యక్తి ( ఇబ్రహీం ) కువైట్ నుండి వచ్చిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని.. ప్రస్తుతం ఇబ్రహీం కు సంబంధించిన టెస్ట్ లను పుణె కు పంపామన్నారు. తెలంగాణ లో ఒక్క కేసు మాత్రమే నమోదు అయిందని.. ఇది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయన్నారు. హైదరాబాద్ లో ఎక్కువగా డెంగ్యూ వ్యాధి వస్తుందని.. కుటుంబ సంక్షేమ కమిషనర్ ను ఈ అంటూ వ్యాధుల కు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ గా నియమించామన్నారు. ప్రస్తుతం ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా వ్యాధి ప్రభలుతుందన్నారు. మలేరియా , డెంగ్యూ వ్యాధులు పెరగకుండ అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందని.. ప్రతి ఆదివారం హెల్త్ టిం చర్యలు తీసుకోవాలని నిర్ణయంచామన్నారు.