Botsa Clarifies Why CM Jagan Not Invited For Dinner With Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందుకు సీఎం జగన్ ను ఆహ్వానించలేదని ఏపీలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే . ప్రజా చైతన్య యాత్రలో ఉన్న చంద్రబాబు ట్రంప్‌తో విందుకు పిలవకపోవడంపై విమర్శలు గుప్పించారు.. ట్రంప్‌తో విందుకు జగన్‌కు ఆహ్వానం అందకపోవడం, చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు కడుపు మంటతో సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు . ఇక చంద్రబాబే తెలివైనవారు అని ఫీల్ అవుతున్నారని మిగిలిన వారు అమయాకులు అనుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు అన్నీ తెలుసని.. అంత అమాయకులు కాదన్నారు.
జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. నవీన్ పట్నాయక్ నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా ఆయనకు ఆహ్వానం ఎందుకు అందలేదని బొత్స ప్రశ్నించారు. బీజేపీ వాళ్ల సమీకరణలు ఆలోచనలు వాళ్లకు ఉంటాయని నవీన్ పట్నాయక్ నాలుగోసారి ముఖ్యమంత్రి కదా ఎందుకు పిలవలేదు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎందుకు ఆహ్వానం అందలేదని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఎవరికైతే బలమైన నాయకత్వాలు ఉన్నాయి.. అలాంటి వాళ్లను పిలవలేదన్నారు మంత్రి. అందుకే జగన్‌కు పిలవలేదని తాము అనుకుంటున్నామరి.. అలాగే మరేవైనా కారణాలు ఉండొచ్చన్నారు. ఈ దేశంలో జగన్ బలమైన నాయకుడని తాము బలంగా నమ్ముతున్నాము అన్నారు. మీడియా ప్రతినిధులు చంద్రబాబు వ్యాఖ్యల్ని ప్రశ్నించగా.. వాటిపై ఆయన్నే వివరణ అడగాలన్నారు బొత్స. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.