చంద్రబాబు తొత్తులే ఉన్నత స్థానంలో ..

Botsa Fires On Legislative Chairman Shariff

శాసన మండలి రద్దు చెయ్యాలని వైసీపీ భావిస్తుంది. నిన్న రాజధాని వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకపోవతంతో షాక్ కు గురైన వైసీపీ సర్కార్ ఎలాగైనా శాసన మండలి రద్దు చేసి తీరాలని భావిస్తుంది.  శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలతో ఆగ్రహంగా ఉన్న సీఎం వైఎస్ జగన్… మండలి రద్దుపై లోతుగా చర్చిస్తున్నారనే చర్చ జరుగుతుండగా.. వాటికి మరింత బలం చేకూర్చేవిధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.  బొత్సా శాసనమండలిలో నిన్నటి పరిణామాలపై  చంద్రబాబు తొత్తుల్ని తీసుకొచ్చిఉన్నతస్థానంలో కూర్చోబెట్టారని మండిపడ్డారు . అందుకే మండలి రద్దు చేయాల్సి వస్తోందని ప్రకటించారు.శాసన మండలిలో బిల్లులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు బొత్స… సంఖ్యాబలం ఉందని మండలిలో అడ్డగోలుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు చెప్పినట్లుగా మండలి చైర్మన్‌ నడుచుకున్నారని ఫైర్ అయ్యారు. నిబంధనలు పాటించాలని చెప్పినా మండలి చైర్మన్ పాటించలేదని మండిపడ్డ బొత్స ఇలాంటి వ్యవస్థ ఉండాలా లేదా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఇలాంటి వ్యవస్థ అవసరం లేదని మాట్లాడారు. ఉన్నత పదవుల్లో తాబేదార్లకు కూర్చోబెట్టే వ్యవస్థపై చర్చ జరగాలన్నారు. శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తామని చెప్పిన ఆయన  ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు . …

Botsa Fires On Legislative Chairman Shariff,AP council ,  capital decentralization bill, ycp ministers ,  chairman shareef , minister botsa sathyanarayana , revoke,  chandra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *