రాజధానిని స్మశానం తో పోలుస్తూ బొత్స వ్యాఖ్యల దుమారం

135
Botsa Satyanarayana
Botsa Satyanarayana

Botsa Satyanarayana Comments On AP Capital

మంత్రి బొత్సా రాజధాని అమరావతి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న అమరావతిలో పర్యటించాలని నిర్ణయించారు. దీనికి స్పందనగా మంత్రి బొత్సా మాట్లాడుతూ..అమరావతిని శ్మశానంతో పోలుస్తూ మాట్లాడారు. రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా..అంటూ ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా ఐదేళ్లలో ఏమీ చేయకుండా ఇప్పుడు ఏం చేయడానికి వస్తున్నారన్న అర్థంలోనే తాను ఆ పదం ఉపయోగించానని మంత్రి చెప్పారు. ఇప్పుడు బొత్సా చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ రాజధానిని శ్మశానంతో పోల్చటం ఏంటని నిలదీస్తున్నారు. అసెంబ్లీ..హైకోర్టు..సచివాలయం ఉన్న రాజధాని శ్మశానంతో పోల్చిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ నెల 8 వ తారీఖున అమరావతి పర్యటనకు రావడం పై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు రాజధాని స్మశానానికి ఏడవడానికి వస్తున్న వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో మంత్రి బొత్స ఏపీ రాజధాని స్మశానం తో పోల్చడం పై టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీలో శాసనసభ హైకోర్టు సచివాలయం వంటి ఉన్నత వ్యవస్థలు ఉన్న రాజధానిని స్మశానం తో పోలుస్తారా అంటూ మండిపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు అవమాన పరిచేలా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఉన్నాయని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంతే కాదు సీఎం స్మశానం నుండి పాలిస్తున్నారు అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధానిని రాష్ట్రాన్ని స్మశానంగా మారుస్తున్నారు నిప్పులు చెరుగుతున్నారు టిడిపి నేతలు. మొత్తానికి బొత్స రాజధానిని స్మశానం తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. ఒకరిమీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఏపీ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

Botsa Satyanarayana Comments On AP Capital,capital, amaravati, botsa sathyanarayana, minister, ycp, chandrababu, tdp, Amaravati,capital of Andhra Pradesh,ap capital is Cemetery

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here