రాష్ట్రంలో ఒక్కబడి కూడా మూతపడలేదు

తాడేపల్లి:ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాసింది. రాష్ట్రంలో ఒక్కబడి కూడా మూతపడలేదు. ఏ పాఠశాల మూతపడిందో చూపించాలి. ప్రభుత్వంపై అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నారు. రాజకీయ లబ్దికోసం లేనిది ఉన్నట్టుగా చూపించే కుట్ర జరుగుతోంది. అమ్మఒడి పథకంపై ఎల్లో మీడియాకు కడుపుమంటగా ఉంది. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే వారికి ఏంటి ఇబ్బంది?. పాఠశాల విద్యను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. కొంతమంది ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడే విధంగా శిక్షణ ఇస్తున్నాము’’ అని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article