ఈ చిన్నారి నిద్రపోతే ముప్పే

BOY SUFFERS WITH RARE DISEAGE

  • అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆరునెలల బాలుడు
  • నిద్రపోకుండా కాపాడుకుంటున్న తల్లి

ఈ చిన్నారి పేరు యధార్థ్ దీక్షిత్. వయను ఆరు నెలలు. అందరిలా తన కొడుకుకి గోరు ముద్దలు తినిపిస్తూ.. చందమామ పాట పాడుతూ నిద్రపుచ్చే భాగ్యం ఆ తల్లికి లేదు. పైగా.. ఒకవేళ తన కుమారుడు నిద్రపోతుంటే వెంటనే నిద్ర లేపాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ బాలుడు అరుదైన ‘సెంట్రల్‌ హైపర్‌ వెంటిలేషన్‌ సిండ్రోమ్‌’ వ్యాధితో బాధపడుతున్నాడు. జన్యులోపాల కారణంగా పుట్టుకతోనే ఈ వ్యాధి వస్తుంది. ఇది ఉన్నవారు నిద్రపోకూడదు. ఒకవేళ గాఢ నిద్రలోకి జారుకుంటే శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోతుంది. దీంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. దీంతో యదార్థ్ తల్లి మీనాక్షి తన కుమారుడు నిద్రపోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.

ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న యధార్థ్ ను ఈ ముప్పు నుంచి తప్పించాలంటే పేస్ మేకర్ అమర్చాలని వైద్యులు పేర్కొన్నారు. దాన్ని అమెరికా నుంచి తీసుకు రావాల్సి ఉంటుందని, అందుకు మొత్తం రూ.38 లక్షలు వ్యయం అవుతుందని వివరించారు. అయితే, నిరుపేద కుటుంబం కావడంతో యధార్థ్ తల్లిదండ్రులు మీనాక్షి, ప్రవీణ్ తీవ్రంగా ఆందోళన చెందారు. వెంటనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రయత్నించగా.. ఇప్పటివరకు రూ.5 లక్షలు పోగయ్యాయి. అంతేకాకుండా ప్రధానమంత్రి మోదీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ట్విట్టర్ ద్వారా విన్నవించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నవారు దాదాపు 1200 మంది ఉంటారని అంచనా. మనదేశంలో నమోదైన తొలి కేసు ఇదే.

HEALTH NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article