బోయ‌పాటి మార‌లేదా?

BOYAPATI WAS NOT CHANGED
మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడిగా పేరున్న బోయపాటి శ్రీనుకి `విన‌య‌విధేయ‌రామ‌` గ‌ట్టి షాకే ఇచ్చింది. ఈ సినిమా పోయింది. రిజ‌ల్ట్ ప‌క్క‌న పెడితే అస‌లు బోయ‌పాటి డైరెక్ష‌న్ చూసి అంద‌రూ న‌వ్వుకున్నారు. ఓ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఇలా చేశాడేంటి అనుకున్నారు కూడా. ఓ ర‌కంగా బోయ‌పాటి చాలా గ‌ట్టి విమ‌ర్శ‌ల‌ను ఫేస్ చేశాడు. కాగా ఇప్పుడు త‌దుప‌రి సినిమాను బాల‌య్య‌తో చేయ‌బోతున్నాడు బోయపాటి. బాల‌య్య‌తో సింహా, లెజెండ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన త‌ర్వాత రానున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `విన‌య‌విధేయ‌రామ‌` స‌మ‌యంలో నిర్మాత‌ల‌కు అవ‌స‌రం లేకున్నా ఎక్కువ‌గా ఖ‌ర్చు పెట్టించాడు బోయ‌పాటి అనే వార్త‌లు గ‌ట్టిగానే నెల‌కొన్నాయి. అయితే ఆ సినిమా ఫ‌లితం త‌న‌లో ఏమైనా మార్పు తెస్తుందా? అదేం క‌న‌ప‌డ‌టం లేద‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. ఎందుకంటే బాల‌య్య సినిమాకు 70 కోట్ల బ‌డ్జెట్లో బోయ‌పాటి ప్లానింగ్ ఉందని టాక్.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article