ప్రతిష్టాత్మక భారీ పాన్ ఇండియా చిత్రం “బ్రహ్మాస్త్రం” ట్రైలర్ విడుదల

ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా,భారీ పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం “బ్రహ్మాస్త్ర”. తెలుగులో దీనిని బ్రహ్మాస్త్రం పేరుతో విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్రం ట్రైలర్ ను నేడు అధికారికంగా రిలీజ్ చేసారు. మెగాస్టార్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article